ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటాం, రాజీనామాపై చర్చిస్తాం: కెసిఆర్

రాజీనామా నిర్ణయం మాకు మేముగా తీసుకుంటే సరిపోదన్నారు. జెఏసి ఉందని, సమావేశం అనంతరం నిర్ణయాన్ని ప్రకటిస్తామని చెప్పారు. అప్పుడే భవిష్యత్తు కార్యాచరణ కూడా ప్రకటిస్తామని చెప్పారు. రోజంతా సభను స్తంభింపజేసినా కేంద్రం స్పందించక పోవడం విచారకరమన్నారు. 600 మంది విద్యార్థులు తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించారన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులు, ప్రయివేటు ఉద్యోగులు తెలంగాణలోని ప్రతి ఒక్కరూ తెలంగాణ కోసం పోరాడుతున్నారన్నారు. అయినప్పటికీ కేంద్రం తెలంగాణపై నిర్ణయం తీసుకోక పోవడం దురదృష్టకరమన్నారు. ముఖ్యమంత్రికి జీతం రాకపోవడం ఏ రాష్ట్రంలో లేదన్నారు. కేంద్రం తీరు దున్నపోతుపై వానపడ్డట్టుగా ఉందన్నారు.
ఏలూరు పార్లమెంటు సభ్యుడు కావూరి సాంబశివరావు చేసిన వ్యాఖ్యలను ఆయన తేలిగ్గా కొట్టి పారేశారు. కావూరి వ్యాఖ్యలు ఓ సన్నాసి వ్యాఖ్యలు అన్నారు. పరీక్షలు ముంచుకొస్తున్నా ప్రభుత్వం పట్టించుకోక పోవడం విచారకరమన్నారు. కాంగ్రెసు పార్టీ ఎంపీలు తమతో గొంతు కలిపారని కితాబునిచ్చారు. తెలంగాణ కోసం వారి ప్రయత్నాలు వారు చేశారని అన్నారు. సొంత పార్టీ వారే నిరసన తెలిపినప్పటికీ ప్రభుత్వం స్పందించటం లేదన్నారు. కాగా తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎంపీలు రమేష్ రాథోడ్, నామా నాగేశ్వరరావు కూడా వాకవుట్ చేశారు.












Click it and Unblock the Notifications