కాంగ్రెసులో బాబు టిడిపిని విలీనం చేస్తారా?: వైయస్ జగన్ వర్గం
Districts
oi-Pratapreddy
By Pratap
|
కడప: 125 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ, 25 ఏళ్ల టీడీపీ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుని వైయస్ జగన్ అనుకూలురను ఓడించడానికి ప్రయత్నం చేయడం నీచ, నికృష్ట రాజకీయాలకు పరాకాష్ట అని జగన్ అనుకూల కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మండిపడ్డారు. టీడీపీని కాంగ్రెస్‌లో విలీనం చేసే ఆలోచన ఉంటే ముందే చెప్పాలని వారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుకు సూచించారు. ఎమ్మెల్యేలు శ్రీకాంత్‌రెడ్డి, ఆదినారాయణరెడ్డి, అమర్‌నాథ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎస్.రఘురామిరెడ్డిలు గురువారం రాత్రి జిల్లా ఎస్పీ తరుణ్‌జోషిని కలిసిన తర్వాత స్థానిక గెస్ట్‌హౌస్‌లో మీడియాతో మాట్లాడారు. స్వయంగా గెలవలేకనే కాంగ్రెస్, టీడీపీలు మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడుతున్నాయని ఆరోపించారు. అభ్యర్థిని నిలబెడుతున్నారో లేదా ఎన్నికలను బహిష్కరిస్తున్నారో టీడీపీ నేతలు స్పష్టం చేయాలన్నారు. పీఆర్పీలాగానే టీడీపీ కూడా అంచెలంచెలుగా కాంగ్రెస్‌లో విలీనమయ్యేందుకు సిద్ధమవుతోందని విమర్శించారు. టీడీపీ కార్యాలయాల్లో మంత్రుల ప్రెస్‌మీట్లు, విందు రాజకీయాలే ఇందుకు నిదర్శనమన్నారు.
సిగ్గూ లజ్జా లేకుండా జిల్లా మంత్రులు, ఇన్‌చార్జి మంత్రి కోడ్ ఉల్లంఘిస్తున్నారని శాసనసభ్యులు ధ్వజమెత్తారు. ఇన్‌చార్జి మంత్రి కన్నా లక్ష్మినారాయణ కోడ్‌ను పూర్తిగా ఉల్లంఘించి మంగళవారం రాత్రి జిల్లాలోనే బస చేశారని చెప్పారు. ప్రశాంతంగా ఉన్న జిల్లాలో మంత్రులు కక్షలు, కార్పణ్యాలు రేపుతున్నారని దుయ్యబట్టారు. జగన్ పార్టీని దెబ్బతీయడానికి, దేవగుడి నారాయణరెడ్డికి వస్తున్న మద్దతును ఓర్వలేక బోగస్ ఫిర్యాదులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై తగు చర్యలు తీసుకోవాలని ఎస్పీకి ఫిర్యాదు చేశామన్నారు. ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ దేవనాథ్‌రెడ్డి, లక్కిరెడ్డిపల్లె మార్కెట్ కమిటీ చైర్మన్ సుదర్శన్‌రెడ్డి, జెడ్పీటీసీ చల్లా సుదర్శన్‌రెడ్డి, భరత్‌రెడ్డి, హఫీజుల్లాలు పాల్గొన్నారు.
Ex MP YS Jagan camp MLAs criticised Congress and Telugudesam the stand following in MLC election. They made comment that TDP is going to merge in Congress.
Story first published: Friday, March 4, 2011, 10:40 [IST]