కిరణ్, చంద్రబాబు కుమ్ముక్కుతో సమైక్యాంధ్ర కుట్ర: హరీష్ రావు

Harish Rao
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోవడానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కుమ్మక్కయ్యారని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యుడు హరీష్ రావు విమర్శించారు. కిరణ్ కుమార్ రెడ్డిని చంద్రబాబు కాపాడుతున్నారని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. చంద్రబాబు ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఇద్దరు కలిసి సమైక్యాంధ్ర కుట్ర చేస్తున్నారని, ఇందుకు కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలే నిదర్శనమని ఆయన అన్నారు. కుమ్మక్కు కావడం వల్లనే చంద్రబాబు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించడం లేదని ఆయన వ్యాఖ్యానించారు.

కుమ్మక్కులో భాగంగానే కాంగ్రెసు శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డి చంద్రబాబును కలిశారని ఆయన అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఇద్దరు నాయకులు ఒక్కటయ్యారని, తెలుగుదేశం నాయకులు తమ ఎంపిటీసీ సభ్యులను కాంగ్రెసుకు అప్పగిస్తున్నారని, రాష్ట్ర మంత్రి తెలుగుదేశం పార్టీ కార్యాలయాలకు వెళ్తున్నారని ఆయన చెప్పారు. ప్రజా ప్రయోజనాల కన్నా సొంత ప్రయోజనాలే చంద్రబాబుకు, కిరణ్ కుమార్ రెడ్డికి ముఖ్యంగా మారాయని, పరస్పర ప్రయోజనాలను వారు చూసుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ సభ్యులు లేకుండా శాసనసభా సమావేశాలను నిర్వహించుకుంటున్నారని, అది సీమాంధ్ర శాసనసభగా నడుస్తోందని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+