హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎకె ఖాన్ వర్సెస్ కోదండరామ్: మిలియన్ మార్చ్‌పై ప్రకటనలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

AK Khan
హైదరాబాద్: మార్చి 10వ తేదిన తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో నిర్వహించనున్న మిలియన్ మార్చ్‌కి ఎలాంటి అనుమతులు ఇవ్వడం లేదని నగర పోలీస్ కమిషనర్ ఎకే ఖాన్ మంగళవారం విలేకరుల ప్రతినిధుల సమావేశంలో ప్రకటించారు. తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ కోదండరామ్ మిలియన్ మార్చ్‌పై సమాచారం ఇచ్చారని అయితే అనుమతిని మాత్రం అడగలేదని చెప్పారు. అనుమతిని ఇవ్వడం లేదని చెప్పారు. మిలియన్ మార్చ్‌లో చట్టసమ్మతం కాని అంశాలు కొన్ని ఉన్నాయని చెప్పారు. జన జీవనానికి ఇబ్బంది లేకుండా చూడటమే మా బాధ్యత అని అన్నారు. సిబిఎస్‌ఇ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల తల్లిదండ్రులు తమ తమ పిల్లల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

నగరంలో హింసను ప్రేరేపించే పరిస్థితి వస్తే కఠినంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కాగా నగరంలో మరో రెండు మహిళా పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేస్తామని చెప్పారు. లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్‌కు మహిళా ఇన్స్‌పెక్టర్‌ను నియమిస్తామని అన్నారు. కాగా సైఫాబాద్ పోలీసులు కోదండరామ్కు మిలియన్ మార్చ్‌కు అనుమతి లేదంటూ హైకోర్టు నోటీసులు అందజేశారు. ఇందుకు స్పందించిన కోదండరామ్ మేం శాంతిని కోరుకుంటున్నామని చెప్పారు. అయితే ప్రభుత్వం మాత్రం తుపాకులు చూపిస్తుందన్నారు. మిలియన్ మార్చ్‌లో తెలంగాణ ప్రజలు అంతా తెలంగాణ కోసం ప్రతిజ్ఞ చేయాలని అన్నారు.10వ తేదిన మిలియన్ మార్చ్ యథాతథం అన్నారు. శాంతియుతంగా చేసే కార్యక్రమానికి ఎలాంటి అనుమతులు అవసరం లేదని చెప్పారు. 10వ తేదిన విద్యార్థులంతా పరీక్షలకు హాజరు కావాలని ఆయన సూచించారు.

మిలియన్ మార్చ్‌ను అడ్డుకునేందుకు పోలీసులు బెదిరింపు చర్యలకు పాల్పడుతున్నారన్నారు. ప్రభుత్వం అనవసరంగా మార్చ్‌పై అవాంతరాలు సృష్టించవద్దని కోరారు. అవాంతరాలు సృష్టిస్తే ప్రజలు ఎక్కడికక్కడే దీక్షలు చేపట్టాలని కోరారు. మిలియన్ మార్చ్‌లో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. కాగా మిలియన్ మార్చ్ ట్యాంక్ బండ్‌పై ముగుస్తుందని విద్యార్థి జెఏసి చెప్పింది.

English summary
City police commissioner AK Khan said today police were not gave permission to JAC million march. He warned we take serious action if they organize rallies and dharnas. Sairabad police were gave High Court million march rejected notice to Telangana Political JAC chairman Kodandaram.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X