పార్లమెంటు ఆవరణలో కాంగ్రెసు తెలంగాణ ఎంపీల ధర్నా

తెలంగాణ అంశంపై నాన్చుడు ధోరణి కూడదని వారంటున్నారు. కాలయాపన చేస్తే తమ ఆందోళనను ఉధృతం చేస్తామని వారు చెప్పారు. ఈ నెల 10వ తేదీన తలపెట్టిన మిలియన్ మార్చ్ టు హైదరాబాదుకు వారు మద్దతు ప్రకటించారు. తెలంగాణ ఉద్యమాన్ని శాంతిభద్రతల సమస్యగానే చూస్తుండడాన్ని పార్లమెంటు సభ్యుడు మధు యాష్కీ తప్పు పట్టారు. తెలంగాణ ఉద్యమంపై కేంద్ర ప్రభుత్వానికి తప్పుడు నివేదికలు పంపుతున్నారని ఆయన విమర్శించారు. పార్లమెంటు సమావేశాలు ముగిసే వరకు తమ ధర్నా కార్యక్రమాలు కొనసాగుతాయని ఆయన చెప్పారు. తెలంగాణను అడ్డుకోవడానికి సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు కుట్ర చేస్తున్నారని, శ్రీకృష్ణ కమిటీలో తమకు అనుకూలంగా ఉన్న అంశాలతో కరపత్రాలు పంచి పెడుతున్నారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications