ఈస్ట్ కోస్ట్ ప్రాజెక్టు: వైయస్ జగన్‌పై విరుచుకుపడిన శంకర రావు

P Shankar Rao
హైదరాబాద్: శ్రీకాకుళం జిల్లా కాకర్లపల్లి ఈస్ట్ కోస్ట్ థర్మల్ పవర్ ప్రాజెక్టు వ్యవహారంపై చేనేత మంత్రి పి. శంకర రావు మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ మీద విరుచుకుపడ్డారు. ఈ ప్రాజెక్టు వ్యవహారంపై వైయస్ జగన్ న్యాయవిచారణకు డిమాండ్ చేయాలని ఆయన అన్నారు. విచారణ జరిగితే ఆ ప్రాజెక్టు వెనక ఉన్నదెవరో, దాని యజమానులెవరో, బినామీలు ఎవరో బయటపడుతుందని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. వైయస్ జగన్ శ్రీకాకుళం జిల్లాలో ఓదార్పు యాత్ర చేసినప్పుడు ఈస్ట్ కోస్ట్ పవర్ ప్రాజెక్టు వ్యవహారం దృష్టికి రాలేదా అని ఆయన అడిగారు.

దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే సోంపేట పవర్ ప్రాజెక్టుకు, ఈస్ట్ కోస్ట్ పవర్ ప్రాజెక్టుకు భూమిని కేటాయిస్తూ రెండు ఉత్తర్వులు జారీ అయ్యాయని ఆయన చెప్పారు. నాగార్జున కన్‌స్ట్రక్షన్ ఆధ్వర్యంలోని సోంపేట పవర్ ప్రాజెక్టుకు 900 ఎకరాలు, ఈస్ట్ కోస్ట్ పవర్ ప్రాజెక్టుకు 1100 ఎకరాలు కేటాయిస్తూ జీవోలు జారీ అయినట్లు ఆయన తెలిపారు. విచారణ జరిపిస్తే ఆ పాపం ఎవరిదో బయటపడుతుందని ఆయన అన్నారు. సోంపేట, కాకర్లపల్లి ప్రాజెక్టులను వ్యతిరేకిస్తూ వైయస్ హయాంలో కూడా ప్రజలు ఆందోళన చేశారని ఆయన గుర్తు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+