• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

జగన్ వర్గంలో అసంతృప్తి: పర్యటనలు పేలవం!

By Srinivas
|

YS Jagan
హైదరాబాద్: మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం నేతల్లో ఇది వరకు ఉన్న ఉత్సాహం ఇప్పుడు కనిపించడం లేదు. జగన్ తన పార్టీ ప్రకటనను తరుచూ వాయిదా వేస్తున్నట్లుగా ప్రజల్లో అపోహలు ఉన్నట్టుగా పలువురు జగన్ వర్గానికి చెందిన నేతలు భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. తెలంగాణతోపాటు జగన్‌కు ప్రజల్లో ఆసక్తి, ఇమేజ్ తగ్గుతుందన్న భావన కూడా వారిలో కలుగుతున్నట్లుగా ఉంది. ఇందుకు జగనే కారకుడిగా వారు భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. త్వరలో పార్టీని ప్రకటిస్తానని చెప్పుకుంటూ వచ్చి, మార్చి మొదటి లేదా రెండో వారంలో తప్పకుండా పార్టీ ప్రకటన ఉంటుందని జగన్ వర్గం నేతలు చెప్పారు. కేంద్ర ఎన్నికల సంఘం వద్ద కూడా జగన్ పార్టీ ఆమోదం పూర్తయింది.

పార్టీకి ఆమోద ముద్ర పడిన తర్వాత కూడా ఇంకా జగన్ పార్టీని ప్రకటించక పోవడంతో జగన్ వర్గం తీవ్ర ఆందోళన చెందుతున్నట్టుగా తెలుస్తోంది. ముంగిట్లో శాసనమండలి ఎన్నికలు, కడప పార్లమెంటు, పులివెందుల శాసనసభ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో జగన్ మాత్రం ఎలాంటి హడావుడి లేకుండా కేవలం ప్రజల్లోకి వెళ్లాలనే ఉద్దేశ్యంతో దీక్షలు చేపడుతూ, పాదయాత్రలు చేస్తు గడుపుతున్నారు. కానీ మార్చి మొదటి లేదా రెండో వారంలో ఉంటుందన్న పార్టీపై మాత్రం ఇంత వరకు ఎలాంటి చర్యలు కనిపించడం లేదు. దీంతో జగన్ వర్గం తీవ్ర ఒత్తిడికి గురవుతున్నట్టుగా తెలుస్తోంది. ఉప ఎన్నికలు, శాసనమండలి ఎన్నికలకు తోడు నామినేటెడ్ పోస్టుల భర్తీని కూడా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి త్వరలో భర్తీ చేస్తామని చెప్పారు.

ఉప ఎన్నికలు ముంచుకు వస్తున్న తరుణంలో కూడా ఇంకా పార్టీ పెట్టకుండా ఉండటంతో జగన్ కార్యకర్తలతో పాటు, నేతల్లో తీవ్ర అసంతృప్తి నెలకొని ఉన్నట్లుగా తెలుస్తోంది. దీంతో వారు క్రమంగా జగన్‌కు దూరం కావడానికి సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. జగన్ లక్ష్యదీక్ష, జలదీక్ష, జనదీక్ష, పోలవరం యాత్ర, ఫీజు పోరు, నేటి శ్రీకాకుళం మహాధర్నా వరకు జగన్‌కు క్రమంగా దూరం అవుతున్న నేతలే కనిపిస్తున్నారు. ముప్పై మంది ఎమ్మెల్యేలనుండి ఇరవై కంటే తక్కువకు ఫీజు పోరు దీక్షలో సంఖ్యాబలం తగ్గింది. జగన్ శ్రీకాకుళం పర్యటన చాలా పేలవంగా కనిపిస్తున్నట్టుగా ఉంది. పార్టీ ప్రకటించకుండా నిమ్మతంగా ఉన్న జగన్ వెంట వెళ్లడానికి ఆయన అత్యంత దగ్గరగా ఉన్న నేతలు కూడా భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇలాగే మరికొన్నాళ్లు పార్టీ ప్రకటించకుండా ఉంటే జగన్ ప్రభావం నామమాత్రంగానే ఉంటుందని భావిస్తున్న వారు కూడా ఉన్నారు.

ఇన్నాళ్లూ హడావుడిగా పార్టీని ప్రకటిస్తామని చెప్పి లాగి లాగి చివరకు మార్చిలో పార్టీని ప్రకటిస్తామని చెప్పారు. ఆ సమయంలో నేతలంతా జగన్ పార్టీ వచ్చేస్తుందంటూ హడావుడి చేశారు. ప్రముఖ సినీ ఆర్టిస్ట్ తోట తరణి కూడా జగన్ పార్టీ ప్రకటన బహిరంగ సభ కోసం ఇడుపులపాయలో స్థలాన్ని పరిశీలించి వెళ్లారు. కానీ ఇప్పుడు మాత్రం ఏ హడావుడి కనిపించడం లేదు. అయితే ఇందుకు తెలంగాణ ఉద్యమం ఒకటి కాగా, సీమాంధ్రలో కూడా తగ్గుతున్న జగన్ ప్రభావానికి తోడు, కాంగ్రెస్‌కు క్రమంగా బలం పెరుకుతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. జగన్ పార్టీ వీడినప్పుడు సానుభూతితోనే ఆయన వెంట నడిచినట్టుగా తెలుస్తోంది. అయితే ఆ సానుభూతి పరిమిత కాలమేనని, అది ఎప్పటికీ ఉంటుందనే భావనలో ఉండకూడదని జగన్‌పై ప్రజల సానుభూతిని గమనిస్తున్న పలువురు చెబుతున్నారు.

English summary
It seems, Ex MP YS Jaganmohan Reddy camp senior leaders in disappointed with Jagan's attitude. They were waiting for party announcement. Jagan and his followers confirmed he will announce his party in march first or second week. But Jagan is not ready to announce party now.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X