అన్ని సమస్యలతో పాటు రైతు సమస్యలకు కూడా కాంగ్రెసు కారణం: చంద్రబాబు

అదేసమయంలో రాష్ట్ర రైతాంగం కష్టాల్లో ఉందన్నారు. వీటిని పరిష్కరించే నిమిత్తం ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. నిరుటితో ఈ ఏడాది పెట్టుబడి ఖర్చులు విపరీతంగా పెరిగాయన్నారు. రైతులకు బోనస్‌లు ఎందుకు చెల్లించవద్దో ముఖ్యమంత్రి సమాధానం ఇవ్వాలని ఆయన అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేయటం లేదని ఆరోపించారు. కేంద్రంతో మాట్లాడి ధాన్యం ఎగుమతులకు అనుమతించాలని అన్ని పార్టీలు కోరుతున్నాయన్నారు. రాష్ట్రంలో 40 లక్షల మెట్రిక్ టన్నుల రంగుమారిన ధాన్యం మగ్గిపోతోందన్నారు. ఈ ధాన్యాన్ని కొనుగోలు చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు.