రెచ్చగొట్టే ప్రయత్నాలు వద్దు: అరెస్టులపై ఈటెల ధ్వజం

శాంతియుతంగా మార్చ్ చేస్తామంటే హైదరాబాద్ మొత్తం 144వ సెక్షన్ అంటూ బెదిరింపులకు పాల్పడుతోందన్నారు. నాలుగు కోట్ల ప్రజలు ముక్తకంఠంతో అడుగుతున్న తెలంగాణ కోసం ప్రజలే శాంతియుతంగా మార్చ్ చేసుకోవాలనుకున్నప్పుడు ప్రభుత్వం ఎందుకు అడ్డు చెబుతోందన్నారు. ఈ విషయమై ఇప్పటికే హోంమంత్రి దృష్టికి తీసుకు వెళ్లామని ఆమె సానుకూలంగా స్పందించారని చెప్పారు. అయితే మరోసారి సబితారెడ్డి దృష్టికి ఈ విషయాన్ని తీసుకు వెళతామని అన్నారు. మిలియన్ మార్చ్ ఎట్టి పరిస్థితుల్లో మార్పు చేసే ప్రసక్తి లేదన్నారు. విద్యార్థుల సౌకర్యార్థమై మార్చ్‌ను మధ్యాహ్నానికి వాయిదా వేసినట్టు చెప్పారు.
కాగా మార్చి 10వ తేదిన జరగనున్న మిలియన్ మార్చ్‌లో తెలంగాణ ప్రజలంతా ఏకమై పాల్గొనాలని తెలంగాణ ప్రజా ఫ్రంట్ నేత, ప్రజా గాయకుడు గద్దర్ కోరారు. బుధవారం ఆయన హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో పర్యటించి తెలంగాణపై, ఉద్యమంపై అవగాహన సదస్సులు నిర్వహించారు.












Click it and Unblock the Notifications