హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

భూవివాదం కేసులో మాజీ సిఎం రోశయ్యపై ఎసిబి కేసు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Rosaiah
హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్యపై అవినీతి నిరోధక శాఖ భూవివాదం కేసును నమోదు చేసింది. రోశయ్య, మరో 13మందిపై ఎసిబి కేసు నమోదు చేసింది. అమీర్‌పేటలోని మైత్రివనం సమీపంలో ఉన్న భూవివాదంపై ఈ కేసు నమోదైంది. హైకోర్టు ఆదేశాల మేరకు ఎసిబి ఈ కేసు నమోదు చేసింది. ఈ భూ వ్యవహారంలో మాజీ ముఖ్యమంత్రి రోశయ్య అవినీతికి పాల్పడ్డారని ఆరోపిస్తూ శ్రీరంగరావు అనే అడ్వకేట్ హైకోర్టులో కేసు దాఖలు చేశారు. ఈ వివాదానికి సంబంధించి కేసు నమోదు చేసి చార్జిషీట్ ఫైల్ చేయమని హైకోర్టు ఎసిబిని ఆదేశించింది.

అమీర్‌పేటలోని మైత్రీవనం సమీపంలో ఉన్న ఈ ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తులకు కేటాయించడంలో దాదాపు రెండు వందల కోట్ల రూపాయలు చేతులు మారినట్లు ఆరోపణలు వినవస్తున్నాయి. రోశయ్యపై ఐపిసి 404, 409, 420, 120బీ అవీనితి నిరోధక చట్టం 11, 12, 13 సెక్టర్ల కింద ఎసిబి కేసు నమోదు చేసింది.

English summary
ACB booked case against former Chief Minister Konijeti Rosaiah. ACB booked another 13 members along with 
 
 Rosaiah. Sri Rangarao, an advocate went to high court on this issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X