జగన్ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ స్థాపనకు ఎన్నికల కమిషన్ కొర్రీ
State
oi-Pratapreddy
By Pratap
|
న్యూఢిల్లీ: మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ పార్టీ ఆవిష్కరణపై ఎన్నికల కమిషన్ ఆంక్షలు విధించింది. కడప జిల్లా ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎన్నికల ప్రచారం కార్యక్రమం ముగిసినందున పార్టీ ఆవిష్కరణ సభ జరపకూడదని ఎన్నికల సంఘం వైయస్ జగన్‌ను ఆదేశించింది. అలా ఆవిష్కరించడం ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడమేనని స్పష్టం చేసింది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పతాకను శనివారం మధ్యాహ్నం తన తల్లి వైయస్ విజయలక్ష్మి పులివెందులలో తన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి సమాధి వద్ద ఆవిష్కరిస్తారని జగన్ శుక్రవారం జగ్గంపేట సభలో చెప్పారు.
తనకు ఎన్నికల సంఘం ఇచ్చిన నోటీసుకు జగన్ వివరణ ఇచ్చారు. తాను సమావేశం నిర్వహించడం లేదని, తన తండ్రి సమాధి వద్ద తన తల్లి, తాను పార్టీ పతాకను మాత్రమే ఆవిష్కరించుకుంటామని, సమావేశం నిర్వహించడం లేదని ఆయన చెప్పారు. ఎన్నికల సంఘం ఆంక్షలపై హైకోర్టుకు వెళ్లాలని జగన్ వర్గానికి చెందిన నాయకులు ఆలోచిస్తున్నారు.
Election Commission ordered YS Jagan not to launch party at Pulivendula, as MLC election campaign is ended. EC said that it is against code of conduct. YS Jagan gave reply to EC that he is not organizing any meeting.
Story first published: Saturday, March 12, 2011, 11:28 [IST]