వైయస్సార్ కాంగ్రెసు జెండా ఆవిష్కరణ, జగన్ పార్టీ ఆవిర్భావం

జెండాలోని నీలం యువత చైతన్యానికి, తెలుపు శాంతికి, ఆకుపచ్చ వ్యవసాయానికి ప్రతీకలు. వైయస్సార్ చిత్రపటం చుట్టూ వైయస్ పాలనలో ప్రవేశపెట్టిన సంక్షేమపథకాలను చేర్చారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉండడంతో తన తల్లితో కలిసి తాను ఒక కుటుంబ కార్యక్రమంగానే జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేసుకుంటానని వైయస్ జగన్ అంతకు ముందు ఎన్నికల సంఘానికి తెలియజేశారు. అయితే, ఈ కార్యక్రమానికి పెద్ద యెత్తున ప్రజలు తరలి వచ్చారు. శాసనసభ్యులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications