హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మాక్ అసెంబ్లీ స్పీకర్‌గా స్పీకర్‌గా టిడిపి ఎమ్మెల్యే హరీశ్వర్‌రెడ్డి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Telugu Desam Party
హైదరాబాద్: తెలంగాణ జర్నలిస్టు ఫోరం ఏర్పాటు చేసిన మాక్ అసెంబ్లీలో టిడిపి ఎమ్మెల్యే హరీశ్వర్ రెడ్డి స్పీకర్‌గా ఎన్నికయ్యారు. సోమవారం నిర్వహించిన మాక్ అసెంబ్లీలో టిఆర్ఎస్, బిజెపి, టిడిపి ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. కాగా మాక్ అసెంబ్లీలో మొదట అందరూ ఎమ్మెల్యేలు రాష్ట్ర విభజనపై తీర్మానం చేశారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెట్టాలని ఏకగ్రీవ తీర్మానం చేశారు. అనంతరం తెలంగాణ అమర వీరులకు నివాళులు అర్పించారు. అనంతరం ఎమ్మెల్యేలు మాట్లాడారు. సమైక్యాంధ్రలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. సమైక్యాంధ్రలో నిధులకు, నీళ్లకు, పదవులకు రక్షణ లేకుండా పోయిందన్నారు. పెద్ద మనుషుల ఒప్పందాన్ని సీమాంధ్ర పాలకులు తుంగలో తొక్కారని చెప్పారు.

పార్టీల్లో సీమాంధ్రుల పెత్తనమే ఉందన్నారు. తెలంగాణకు అన్ని రంగాలలో అన్యాయం జరిగిందన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ మద్దతు ఇస్తామని చెప్పినప్పటికీ కేంద్రం బిల్లును ఎందుకు ప్రవేశ పెట్టడం లేదని ప్రశ్నించారు. బిల్లు పెట్టకుండా తాత్సారం చేస్తే మంచిది కాదన్నారు. తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందన్నారు. తెలంగాణ నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష అన్నారు. తెలంగాణపై కేంద్రం దిగిరావలంటే అందరూ మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కేంద్రం దిగి రావాలంటే రాజీనామాలు ఒక్కటే శరణ్యం అన్నారు.

డిసెంబర్ 9న ప్రకటనకు కేంద్రం కట్టుబడి ఉండాలన్నారు. కేంద్రం కారణంగా 600 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారన్నారు. తెలంగాణ - ఆంధ్రా ఎప్పుడైనా విడిపోవాలంటూ భారత మొదటి ప్రధాని చేసిన ప్రసంగాన్ని వారు గుర్తుకు చేసుకున్నారు. టాంక్‌బండ్‌పై విగ్రహాల ధ్వంసంపై సీమాంధ్రులు విష ప్రచారానికి పూనుకుంటున్నారని మాక్ అసెంబ్లీ సభ్యులు అభిప్రాయపడ్డారు.

English summary
TJF organige mock assembly today. BJP, TRS, TDP MLAs participated in mock assembly. TDP MLA Harishwar Reddy elected as a speaker.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X