హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

భర్త శిరీష్ భరద్వాజ్‌పై పోలీసులకు చిరంజీవి కూతురు శ్రీజ ఫిర్యాదు

By Srikanya
|
Google Oneindia TeluguNews

Srija-Sirish Bharadwaj
హైదరాబాద్‌: భర్త, అత్తమామలు తనను కట్నం కోసం వేధిస్తున్నారంటూ ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి చిన్న కూతురు శ్రీజ సోమవారం పోలీసులను ఆశ్రయించారు. కొన్నినెలలుగా తనను మానసికంగా చిత్రహింసలు పెడుతున్నారంటూ ఆమె ఫిర్యాదు చేశారు. మెట్టినింటి వేధింపులు భరించలేకపోతున్నానంటూ ఒక పోలీసు ఉన్నతాధికారికి ఫోన్‌లో వివరించిన అనంతరం ఆమె సోమవారం మహిళా పోలీసు స్టేషన్‌కు రహస్యంగా వచ్చారు. ఇన్‌స్పెక్టర్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు అందజేశారు. శ్రీజ భర్త శిరీష్‌ భరద్వాజ్‌, అతని తల్లిదండ్రులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ముగ్గురినీ సోమవారం రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది.

చిరంజీవి కుటుంబసభ్యుల మనోభావాలకు వ్యతిరేకంగా ప్రేమ వివాహం చేసుకున్న శ్రీజ, శిరీష్‌ల మధ్య మూడున్నరేళ్లకే మనస్పర్థలు చోటు చేసుకున్నాయి. అక్టోబర్‌ 17, 2007న శ్రీజ, శిరీష్‌ భరద్వాజ్‌లు న్యూబోయిన్‌పల్లిలోని ఆర్య సమాజ్‌లో నాటకీయ పరిణామాల మధ్య పెళ్లిచేసుకున్నారు. శ్రీజకు సంతానం కలిగిన తర్వాత అల్లు అరవింద్‌ మాట్లాడ్డంతో చిరంజీవి కూడా మెత్తబడ్డారు. చిరంజీవి శ్రీజను ఆశీర్వదించడంతో శిరీష్‌కు సెన్సార్‌బోర్డు సభ్యుడిగా పదవి దక్కింది. కొంతకాలంగా శ్రీజ, శిరీష్‌భరధ్వాజ్‌ల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయని తెలిసింది.

తాను ఇప్పటికే శిరీష్ భరద్వాజ్‌కు, మెట్టినింటికి కోట్లాది రూపాయలు ఇచ్చానని, ఇంకా అడుగుతున్నారని శ్రీజ పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. ప్రతి రోజూ తాగి తనను చిత్రహింసలకు గురి చేయడం శిరీష్‌కు అలవాటుగా మారిందని ఆమె ఆరోపించినట్లు సమాచారం. శిరీష్ 1 కోటీ 50 లక్షల రూపాయలు తేవాలని శిరీష్ శ్రీజను డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.

English summary
Even before the images of her 'cinematic' marriage could fade away from public memory, Chiranjeevi's daughter Srija approached the Central Crime Station (CCS) police on Monday alleging that she was being tortured by her husband Sirish Bharadwaj for dowry.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X