కిరణ్ కుమార్ రెడ్డికి షాక్, వైయస్ జగన్ అభ్యర్థికి మద్దతు
Districts
oi-Pratapreddy
By Pratap
|
తిరుపతి: స్థానిక సంస్థల కోటా కింద జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన సొంత జిల్లా చిత్తూరులోని తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కున్నారు. చిత్తూరు జిల్లాకు చెందిన కాంగ్రెసు శాసనసభ్యులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెసు అభ్యర్థికి వ్యతిరేకంగా పని చేశారని జిల్లా కాంగ్రెసు కమిటీ (డిసిసి) అధ్యక్షుడు సుధాకర్ ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి)కి ఫిర్యాదు చేశారు. వైయస్ జగన్ అభ్యర్థులకు మద్దతుగా వారు పనిచేశారని ఆయన తెలిపారు.
చిత్తూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, కుతూహలమ్మ, రవి, షాజహాన్ కాంగ్రెసు అభ్యర్థికి వ్యతిరేకంగా పనిచేశారని, వైయస్ జగన్ అభ్యర్థులకు పనిచేశారని, ఇందుకుగాను బెంగళూర్‌లో క్యాంప్ నిర్వహించారని సుధాకర్ వివరించారు. తమకు మంత్రి పదవులు దక్కకపోవడంతో పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, కుతూహలమ్మ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి వ్యతిరేకంగా పని చేస్తూ వస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ దాన్ని కొనసాగించారని అంటున్నారు.
CM Kirankumar Reddy has faced opposition in his own district Chittoor in MLC election. DCC president Sudhakar complained to PCC against Congress MLAs Peddireddy Ramachandra Reddy, Kuthuhalamma, Ravi and Shajahan.
Story first published: Tuesday, March 15, 2011, 10:44 [IST]