వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
చంద్రబాబుకు యెడ్ల షాక్: బొత్స ఆధ్వర్యంలో కాంగ్రెస్‌లోకి

యెడ్లకు జిల్లాలో మంచి పట్టు ఉంది. గ్రామీణ స్థాయిలో అయనకు మంచి పేరు ఉంది. ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండే వ్యక్తిగా పేరు పొందాడు. అలాంటి వ్యక్తిని నిలబెట్టుకోవడానికి టిడిపి ఎలాంటి చర్యలు చేపట్టలేదని తెలుస్తోంది. కాగా తనను కొందరు పార్టీ నేతలు తమ తమ మొండి వైఖరితో బయటకు పంపారని ఆయన అన్నారు. కాగా ఆయనను మంత్రి బొత్స సత్యనారాయణ సాధరంగా ఆహ్వానించారు.
గత కొంతకాలంగా యెడ్ల టిడిపిని వీడుతారనే ప్రచారం జరిగింది. అయితే దీనిపై టిడిపి దృష్టి సారించలేదని వాదనలు వచ్చినప్పటికీ, చాలామంది ఆయన మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్మోహన్ రెడ్డి పార్టీలో చేరతారనే వాదనలు వినిపించాయి. అయితే అందరి ఊహాగానాలు తారుమారు చేస్తూ ఆయన కాంగ్రెస్ పార్టీలోకి మారిపోయారు.