హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

భర్త శిరీష్ భరద్వాజ్‌తో కాపురం చేయలేనంటున్న శ్రీజ?

By Pratap
|
Google Oneindia TeluguNews

Srija
హైదరాబాద్: తన భర్త శిరీష్ భరద్వాజ్‌తో తాను కాపురం చేయలేనని ప్రజారాజ్యం పార్టీ అధినేత, మెగాస్టార్ చిరంజీవి కూతురు శ్రీజ తేల్చి చెప్పినట్లు సమాచారం. అందుకే ఆమె కౌన్సెలింగ్‌కు నిరాకరించినట్లు తెలుస్తోంది. అత్తగారింట్లో వేధింపులకు గురి చేస్తున్నారంటూ చిరంజీవి కుమార్తె శ్రీజ పోలీసులను ఆశ్రయించిన విషయం తెలిసిందే. శ్రీజ ఫిర్యాదు మేరకు భర్త శిరీష్‌భరద్వాజ్‌ను, అతడి తల్లి సూర్యమంగళను మంగళవారం అరెస్టు చేస్తారన్న సమాచారంతో మీడియా మొత్తం హైదరాబాదులోని బషీర్‌బాగ్‌లో గల మహిళా పోలీసు స్టేషన్‌కు చేరుకుంది. వీరిద్దరినీ అరెస్టు చేసేందుకు కొంత ప్రక్రియ ఉందంటూ పోలీసు అధికారులు తెలిపారు.

తాను అత్తవారింట్లో ఆరు నెలలుగా మానసికంగా, శారీరకంగా చిత్రవధ అనుభవిస్తున్నానని, ఆ బాధలు తట్టుకోలేకే మహిళా పోలీసు స్టేషన్‌కు వచ్చినట్లు శ్రీజ తన ఫిర్యాదులో తెలిపారు. వివాహం జరిగిన కొద్దిరోజుల అనంతరం ఇద్దరం సుఖంగా జీవించేందుకు వ్యాపారం చేయాలనుకొంటున్నట్లు శిరీష్‌ ప్రతిపాదించాడని, తన వద్దనున్న ఆభరణాలను ఇచ్చానని, దీంతో సంతృప్తి చెందకుండా మళ్లీ డబ్బు కావాలంటూ వేధింపులు మొదలుపెట్టాడని ఆమె తెలిపారు. బంధువులు, కుటుంబసభ్యుల వద్ద నుంచి రూ.1.50 కోట్ల నగదు ఇస్తే వ్యాపారం చేయలేదని, మరికొంత సొమ్ము తీసుకురావాలంటూ బెదిరించాడని వివరించారు.

ఏడాది నుంచి తాను ఎంత సర్దిచెపుతున్నా తన భర్త, అత్త తనను దూషించడంతో పాటు అప్పుడప్పుడు శారీరకంగా హింసిస్తూ వచ్చారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆరు నెలల నుంచి హింస భరించలేనంతగా తీవ్రమైందని, వీరిద్దరిపై చర్యలు తీసుకోవాలని శ్రీజ తన ఫిర్యాదులో చెప్పారు. తాము ప్రాథమిక విచారణ చేశామని, కౌన్సెలింగ్‌ వద్దని శ్రీజ చెప్పడంతో కేసు నమోదు చేశామని డీసీపీ(నేరాలు) సత్యనారాయణ తెలిపారు. శిరీష్‌ భరద్వాజ్‌, సూర్యమంగళపై కేసు నమోదు చేశామన్నారు నిందితులను అరెస్ట్‌ చేస్తామన్నారు. పోలీసులు ఇప్పటికే శిరీష్‌ భరద్వాజ్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం.

English summary
It is learnt that Prajarajyam president Chiranjeevi's daughter Srija is rejecting to live with her husband Sirish Bharadwaj. She complained to the police against her husband Sirish Bharadwaj alleging dowry harassment.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X