చెన్నై:
మిత్రపక్షాలతో
సీట్ల
సర్దుబాటు
విషయంలో
అన్నాడియంకె
నేత
జయలలిత
ఏకపక్షంగా
వెళ్తున్నట్లు
విమర్శలు
వస్తున్నాయి.
అతి
విశ్వాసం
వల్లనే
జయలలిత
మిత్రపక్షాలకు
టోకరా
ఇస్తున్నట్లు
సమాచారం.
డిఎంకె,
కాంగ్రెసు
కూటమిని
ఓడించి
తీరుతామనే
దీమానే
ఆమెను
ఈ
దిశగా
నడిపిస్తున్నట్లు
చెబుతున్నారు.
మిత్రపక్షాలతో
సంప్రదించకుండా
జయలలిత
ఏకపక్షంగా
వ్యవహరిస్తున్నారని
వామపక్షాల
నేతలు
అసంతృప్తి
వ్యక్తం
చేస్తున్నారు.
త్వరలో
జరగనున్న
తమిళనాడు
అసెంబ్లీ
ఎన్నికల్లో
పోటీ
చేసే
అభ్యర్థుల
మొదటి
జాబితాను
బుధవారం
అన్నాడియంక
విడుదల
చేసింది.
ఇందులో
అందరూ
సిటింగ్
అభ్యర్థులే
ఉన్నారు.
ఆయా
నియోజకవర్గాల్లో
గత
ఎన్నికల్లో
మిత్రపక్షాల
అండతోవీరు
గెలిచారని,
ప్రస్తుతం
తమతో
చర్చించకుండానే
జయలలిత
నిర్ణయం
తీసుకున్నారని
వామపక్షాల
నేతలు
ఆరోపిస్తున్నారు.
దీనిపై
డీఎండీకే
అధ్యక్షుడు
విజయకాంత్‌తో
వామపక్షాల
నేతలు
సమావేశమై
తదుపరి
కార్యాచరణపై
చర్చిస్తున్నారు.
కాగా,
సినీ
నటుడు
కార్తిక్
ఇప్పటికే
జయలలితకు
దూరమయ్యారు.
తనకు
ఒక్క
సీటైనా
జయలలిత
కేటాయిస్తారని
ఆయన
ఆశించారు.
అయితే,
ఆ
ఒక్క
సీటు
కూడా
ఆయనకు
దక్కలేదు.
తనకు
ఒక్క
సీటు
ఇస్తారని
కార్తిక్
ఏకపక్షంగా
ప్రకటించడం
వల్లనే
జయలలిత
కోపగించుకున్నారని,
అందుకే
ఆ
సీటు
కూడా
కేటాయించలేదని
అన్నాడియంకె
వర్గాలు
అంటున్నాయి.
కాగా,
వైగో
నాయకత్వంలోని
ఎండిఎంకెతో
కూడా
అన్నాడియంకె
సంబంధాలు
బెడిసికొట్టినట్లు
తెలుస్తోంది.
గత
ఎన్నికల్లో
ఎండియంకెకు
35
సీట్లకు
పోటీ
చేసింది.
అయితే,
ఈసారి
8
స్థానాలు
మాత్రమే
ఇస్తామని
జయలలిత
ఎండియంకె
నేతలకు
తేల్చి
చెప్పారు.
దీంతో
ఇరు
పార్టీల
మధ్య
విభేదాలు
పొడసూపాయి.
ఈ
విభేదాలతో
యండిఎంకె
కూడా
కూటమి
నుంచి
వైదొలిగినట్లేనని
భావిస్తున్నారు.
AIDMK president Jayalalithaa is facing criticism from friendly parties on seat sharing Tamilandu assembly polls. Even Left parties are expressing anguish at Jayalalithaa's unilateral decission on seat sharing.
Story first published: Thursday, March 17, 2011, 17:22 [IST]