హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అస్తి పన్ను కట్టక పోవడంతో స్కూల్ సీజ్: తోపులాట, ఉద్రిక్తత

By Srinivas
|
Google Oneindia TeluguNews

Hyderabad
హైదరాబాద్: ఆస్తి పన్ను కట్టక పోవడంతో నగరంలోని ఓ పాఠశాలను మునిసిపల్ అధికారులు గురువారం సీజ్ చేసేందుకు ప్రయత్నించారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. హైదరాబాద్‌లోని మల్కాజ్‌గిరి దగ్గరలోని నేరెడ్‌మెట్ ప్రాంతంలో ఉన్న పిబి డిఎవి పాఠశాల 20 లక్షల ఆస్తి పన్ను కట్టాల్సి ఉంది. అయితే అధికారులు పలుమార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ పాఠశాల యాజమాన్యం నుండి స్పందన లేక పోవడంతో గురువారం మునిసిపల్ అధికారులు పాఠశాలకు తాళాలు వేశారు.

దీంతో పాఠశాల యాజమాన్యం వారిని అడ్డుకునే ప్రయత్నాలు చేసింది. ఇరువర్గాల మధ్య వాగ్వాదం తారాస్థాయికి చేరడంతో తోపులాట జరిగింది. ఇదిలా ఉండగా ఈ పాఠశాల ఢిల్లీ బేస్ట్ పాఠశాల. ఇక్కడ పదవ తరగతి వరకు ఉంది. అయితే మరికొద్ది రోజుల్లో పరీక్షలు ఉండటంతో విద్యార్థులు పరీక్షలకు సిద్ధమవుతున్నారు. ఈ సమయంలో పాఠశాలను మూసి వేయించడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

English summary
Hyderabad municipal officers ceased PB DAV public school today, which is located Neredmet of Hyderabad. Agitation take place between officers and School management.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X