వైయస్ జగన్‌కు షాక్: ఎమ్మెల్సీ ఎన్నికల్లో సజ్జల ఓటమి
Districts
oi-Srinivas G
By Srinivas
|
కడప: ఇటీవల జరిగిన శాసనమండలి ఎన్నికలో మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి, ఆయన వర్గానికి పెద్ద ఝలక్ తగిలింది. శాసనమండలి ఎన్నికలలో పట్టభద్రుల స్థానం నుండి జగన్ వర్గం తరఫున సజ్జల శ్రీధర్ రెడ్డి పోటీ చేశారు. అయితే ఆయన జన విజ్ఞాన వేదిక నేత అయిన ఎం.గేయానంద్ ఓడిపోయారు. యోగానంద్‌ను యూటిఎఫ్ బలపరిచింది. జగన్ సొంత జిల్లాతో పాటు రాయలసీమలో జగన్‌కు గట్టి పట్టు ఉంటుందని జగన్‌తో పాటు ఆయన వర్గం భావించినప్పటికీ ఆయన అభ్యర్థి ఓడిపోవటం ఆ వర్గానికి షాక్ కలిగించింది.
కడప - అనంతపుర్ - కర్నూల్ పట్టభద్రుల స్థానం నుండి సజ్జల పోటీ చేశారు. అయితే జగన్ ప్రత్యక్షంగా సజ్జలకు మద్దతు పలకలేదు. అయితే ఆయన మాత్రం జగన్ వర్గంగా బరిలోకి దిగినట్టు తెలుస్తోంది. కానీ జగన్ మామ, కడప మాజీ మేయర్ రవీంద్రనాథ్ రెడ్డి శ్రీధర్ రెడ్డిని బలపరిచారు.