వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఓటేస్తే రూ.పదికోట్లు, అసదుద్దీన్‌ది అదే దారి: వికీలీక్స్ మరో సంచనలం

By Srinivas
|
Google Oneindia TeluguNews

WikiLeaks
న్యూఢిల్లీ: వరుస సంచలనాలతో అంతర్జాతీయ స్థాయిలో ప్రకంపనలు సృష్టిస్తున్న వికీలీక్స్ గత కొద్దికాలంగా భారతదేశంలో జరిగిన అక్రమాలపై కూడా తన కొరడా ఝులిపించింది. మొదట స్విస్ బ్యాంకులలో భారతీయులకు భారీగా నల్లడబ్బు మూటలు ఉన్నాయని చెప్పిన వికీలీక్స్ ఇటీవల దేశ రాజకీయాలలో పేరుకు పోయిన అవినీతిని బయటకు తీస్తోంది. దక్షిణ భారతదేశంలో నోటుకు ఓటు పద్ధతి బాగా ఉందని చెప్పిన వికీలీక్స్ మరో సంచలనాన్ని బయటకు తెచ్చింది.

గత సాధారణ ఎన్నికలకు ముందు 2008వ సంవత్సరంలో అమెరికాతో అణు ఒప్పందం నేపథ్యంలో యూపిఏ ప్రభుత్వంతో కమ్యూనిస్టు పార్టీలు తెగతెంపులు చేసుకున్న తర్వాత కేంద్ర ప్రభుత్వం మైనారటీలో పడిపోయింది. అప్పుడు విశ్వాస పరీక్షలో నెగ్గడానికి కేంద్ర ప్రభుత్వం ఆర్ఎల్‌డి పార్లమెంటు సభ్యులకు ఒక్కొక్కరికి రూ.10 కోట్లు ముట్టజెప్పినట్టు వికీలీక్స్ తాజాగా బయట పెట్టింది. కాంగ్రెస్ సీనియర్ నేత సతీష్ శర్మ నేతృత్వంలో ఈ డబ్బులు పంచినట్టుగా బయట పెట్టింది.

కాగా రాష్ట్రంలో ఎంఐఎం పార్టీకి చెందిన అసదుద్దీన్ ఓవైసీ కూడా ఓటును నోటు పద్ధని అనుసరించారని చెప్పింది. ఎన్నికలలో తమ తమ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాడనికి ఎలా ప్రలోభ పెట్టారో అసదుద్దీన్ బాహాటంగానే ఎలాంటి సంకోచం లేకుండా చెప్పారన్నది. వికిలీక్స్ వెల్లడించిన విషయాలపై గురువారం పార్లమెంటు ఉభయ సభలు అట్టుడికాయి. ఈ వ్యవహారంపై సభా కార్యక్రమాలను ప్రతిపక్ష సభ్యులు స్తంభింపజేశారు. దీంతో ఉభయ సభలు కూడా వాయిదా పడ్డాయి.

English summary
Wikileaks India revealed another yesterday. Wikileaks accused central government in 2008 confidential vote. Congress gave RS. 10 crores each RLD MP for vote.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X