వైయస్ జగన్‌పై అహ్మదుల్లా సీరియస్, జానీ ఓటమికి కుట్ర

జానీకి వ్యతిరేకంగా పనిచేసి వైయస్ జగన్ ఏం సాధించారని ఆయన ప్రశ్నించారు. మహ్మద్ జానీకి వ్యతిరేకంగా వ్యవహరించి వైయస్ జగన్ మైనారిటీల మనోభావాలను దెబ్బ తీశారని ఆయన వ్యాఖ్యానించారు. జానీని ఓడించడానికి వైయస్ జగన్ కుట్ర చేశారని ఆయన ఆరోపించారు. క్రాస్ వోటింగ్‌కు పాల్పడి జానీ ఓడించడానికి ప్రయత్నించినవారిపై కాంగ్రెసు అధిష్టానానికి ఫిర్యాదు చేస్తానని ఆయన హెచ్చరించారు. కాంగ్రెసులోని ఉంటూ కాంగ్రెసునే వెన్నుపోటు పొడిచినవారిని దేవుడు క్షమించడని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications