రాజకీయ నాయకులే తెలంగాణకు అడ్డు: యోగా గురు బాబా రామ్‌దేవ్
Districts
oi-Srinivas G
By Srinivas
|
మెదక్: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి రాజకీయ నాయకులే అడ్డంకి అని ప్రముఖ యోగా గురువు రామ్‌దేవ్ బాబా శుక్రవారం మెదక్ జిల్లాలో చెప్పారు. తెలంగాణ పట్ల రాష్ట్రంలోని ప్రజలు అడ్డుకోవడం లేదన్నారు. స్వార్థ రాజకీయ నాయకుల కారణంగానే తెలంగాణ అంశం వెనక్కి పోతోందన్నారు. తెలంగాణ అంశం ప్రధాని మన్మోహన్ సింగ్, కేంద్రం పరిధిలోనే ఉందని చెప్పారు. కేంద్రం తెలంగాణ సమస్యను వెంటనే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు.
తెలంగాణ అంశంపై కేంద్రం ఇంకా నాన్చుడు ధోరణితో ఉంటే శాంతిభద్రతల సమస్యలు తలెత్తే అవకాశముందని ఆయన హెచ్చరించారు. కేంద్రం వెంటనే తెలంగాణపై నిర్ణయం తీసుకోవాలని అన్నారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానని ఆయన మరోమారు స్పష్టం చేశారు. కేవలం ఆధ్యాత్మికతను ప్రచారం చేయడమే తన లక్ష్యమని చెప్పారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ పటిష్టతకే తాను ప్రచారం చేస్తున్నానని చెప్పారు.