కోదండరామ్ ఇదేనా నీ చదువు, కెసిఆర్ సమాధానం చెప్పు: దేవినేని ఉమ

సమైక్యాంధ్ర కోసం రాజీనామాలు మాత్రమే కాదని ప్రాణాలు అర్పించడానికి కూడా సిద్ధమని చెప్పారు. ప్రత్యర్థులకు ఓటు వేసిన టిడిపి రెబల్ అభ్యర్థులు వెంటనే రాజీనామా చేయాలని వారు మాజీ పార్లమెంటు సభ్యుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వర్గం, టిడిపి అసమ్మతి నేతలు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, బాలనాగిరెడ్డిలను ఉద్దేశించి డిమాండ్ చేశారు. తెలంగాణపై తమకు ఎంతో చిత్తశుద్ధి ఉందని చెప్పుకునే తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె చంద్రశేఖరరావు ఇప్పుడు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వయంగా ముగ్గురు టిఆర్ఎస్ ఎమ్మెల్యేలే అమ్ముడు పోయారని దీనిపై ఏం చెబుతాని అన్నారు. తెలంగాణ కోసమంటూ గెలిచి గతంలో తొమ్మిదిమంది, ఇప్పుడు ముగ్గురు వేరే పార్టీలకు అమ్ముడు పోయారన్నారు. తెలంగాణ ఉద్యమం పట్ల టిఆర్ఎస్ చిత్తశుద్ధి ఏంటో దీంతో తేలిపోయిందన్నారు.