హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బెడిసికొట్టిన కెసిఆర్, చంద్రబాబు వ్యూహాలు: గట్టెక్కిన కిరణ్ కుమార్

By Pratap
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu-K Chandrasekhar Rao
హైదరాబాద్‌: శాసనసభ్యుల కోటా కింద జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు వ్యూహాలు బెడిసికొట్టాయి. చావు తప్పి కన్ను లొట్టబోయినట్లు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బయటపడ్డారు. తమ నాలుగో అభ్యర్థిని గెలిపించుకోవడానికి చంద్రబాబు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఆయన జాగ్రత్త వల్ల మహిళా అభ్యర్థి, ఎస్సీ ప్రతిభా భారతి ఓటమి పాలయ్యారు. ఇది చంద్రబాబును వెంటాడే విషయమే. తొలి ప్రాధాన్యతా ఓట్లలో ప్రతిభా భారతికి కాంగ్రెసు అభ్యర్థి మహ్మద్ జానీ కన్నా ఎక్కువ ఓట్లు వచ్చాయి. అయితే రెండో ప్రాధాన్యతా ఓట్ల లెక్కింపులో మహ్మద్ జానీ విజయం సాధించారు.

మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ వ్యూహం వల్ల ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నైతికంగా దెబ్బ తిన్నట్లే. మహ్మద్ జానీ గెలిచినప్పటికీ కిరణ్ కుమార్ రెడ్డి నైతికంగా దెబ్బ తిన్నారు. వైయస్ జగన్ వర్గం శానససభ్యులు మహ్మద్ జానీని ఓడించేందుకు ప్రయత్నించారు. పది మంది జగన్ వర్గం శాసనసభ్యులు క్రాస్ వోటింగ్ చేశారు. అయితే, వైయస్ జగన్ సూచించినట్లు జానీకి కేటాయించిన శాసనసభ్యులంతా మజ్లీస్ అభ్యర్థి రిజ్వీకి ఓటేసి ఉంటే కిరణ్ కుమార్ రెడ్డి వ్యూహం పూర్తిగా బెడిసికొట్టేదే.

కాగా, తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుకు నైతికంగా కూడా ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రమాదకరంగానే పరిణమించాయి. తెరాస అభ్యర్థి మహ్మద్ అలీకి 13 ఓట్లు రావాల్సి ఉండగా 11 ఓట్లు మాత్రమే వచ్చాయి. తెరాసకు 11 ఓట్లు మాత్రమే ఉన్నప్పటికీ బిజెపి ఓట్లు రెండు కూడా ఉన్నాయి. ఇందుకు బిజెపిని నిందించడానికి తెరాస నాయకులు ప్రయత్నించారు. దీనికి బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి తీవ్రంగా ప్రతిస్పందించారు. తమ రెండు ఓట్లు తెరాసకే వేశామని చెప్పారు. దాంతో తమ శాసనసభ్యులు ఇద్దరు క్రాస్ వోటింగ్‌కు పాల్పడినట్లు తెరాస నాయకులు గుర్తించారు. దీంతో తెరాస ఆత్మరక్షణలో పడింది.

English summary
TDP president Chandrababu Naidu and TRS president K Chandrasekhar Rao strategies failed in MLC election held under MLAs qouta. CM Kiran Kumar Reddy also failed morally in this election.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X