శ్రీజ కేసు: ముందస్తు బెయిల్‌కు శిరీష్ భరద్వాజ్ దరఖాస్తు

తమ దరఖాస్తుపై నిర్ణయం వెలువడేలోగా పోలీసులు అరెస్టు చేస్తారేమోనన్న అనుమానంతో శిరీష్, ఆయన తల్లి అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం. మహిళా పోలీసు అధికారులు గురువారం శిరీష్ ఇంటికి వెళ్లగా తాళం వేసి ఉంది. చుట్టుపక్కల వారిని ప్రశ్నించగా నాలుగు రోజుల క్రితమే శిరీష్ ఎక్కడికో వెళ్లాడని చెప్పారు. శిరీష్ బంధువుల ఇళ్లకు వెళ్లగా వారూ ఆచూకీ తెలియదని చెప్పడంతో తిరిగి వచ్చారు. ఇతర రాష్ట్రాలు, దేశాలకు వెళ్లకుండా నిరోధించేందుకు దేశంలోని ప్రధాన విమానాశ్రయాలకు లుక్‌అవుట్ నోటీసులు జారీ చేశారు.












Click it and Unblock the Notifications