కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ జగన్‌కు పరీక్ష: మేలో కడప, పులివెందుల ఉప ఎన్నికలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan
న్యూఢిల్లీ: మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి, మాజీ శాసనసభ్యురాలు విజయమ్మ రాజీనామాలతో ఖాలీ అయిన కడప, పులివెందుల పార్లమెంటు, శాసనసభ ఎన్నికలు మే నెలలో జరగనున్నట్లుగా సమాచారం. మే నెలలో ఈ ఉప ఎన్నికలు జరిపించడానికి కేంద్ర ఎన్నికల సంఘం యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఏప్రిల్ నెలలోనే నోటిఫికేషన్ విడుదల చేసి తర్వాతి నెలలో ఎన్నికలు జరిపే అవకాశం ఉంది. దీంతో వైయస్ జగన్‌కు అసలు పరీక్ష ఎదురు కానుంది.

ఉప ఎన్నికల నోటిఫికేషన్ తమిళనాడు, కేరళ, పశ్చిమబెంగాల్, అసోం, పాండిచ్చేరి ఎన్నికల దృష్ట్యా ఆలస్యం అయినట్లుగా తెలుస్తోంది. కడప, పులివెందులతో పాటు దేశవ్యాప్తంగా పది రాష్ట్రాల్లో పలు నియోజకవర్గాలలో జరగనున్న ఉప ఎన్నికలకు కూడా నోటిఫికేషన్ విడుదల చేసి అన్నింటిని ఒకేసారి నిర్వహించాలనే యోచనలో ఈసీ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఉప ఎన్నికల నోటిఫికేషన్ వెలువడితే ఇక బాబాయ్, వ్యవసాయ శాఖమంత్రి వివేకానందరెడ్డి, అబ్బాయ్ వైయస్ జగన్ మధ్య కడప జిల్లాలో రాజకీయ యుద్ధం ప్రారంభమయినట్లే.

English summary
It seems, CEC ready to organize Kadapa and Pulivendula by election in May. Notification will release in april. EC organize along with national wide by election.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X