కడప ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైయస్ జగన్ ఎదురీత, క్యాంపులు

కాంగ్రెసు పార్టీ హైదరాబాదులోనూ కడపలోనూ క్యాంపులు నిర్వహిస్తోంది. కడప నియోజకవర్గంలో 623 ఓట్లున్నాయి. కాంగ్రెసుకు 503 ఓట్లున్నాయి. తెలుగుదేశం పార్టీకి 120 ఓట్లున్నాయి. ఇప్పటికే కాంగ్రెసు పార్టీకి చెందిన ఓట్లతో పాటు తెలుగుదేశం పార్టీకి చెందిన ఓట్లను కాంగ్రెసు, జగన్ వర్గం సగమేసి పంచుకున్నాయి. తెలుగుదేశం పార్టీకి చెందిన 30 మంది ఓటర్లు తటస్థంగా ఉన్నారు. వీరిని లాక్కోవడానికి ఇరు పక్షాలు పోటీ పడుతున్నాయి.
కాగా, జగన్ వర్గం తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థిని ఓడించడానికి మంత్రులు వైయస్ వివేకానంద రెడ్డి, డిఎల్ రవీంద్రా రెడ్డి, కన్నా లక్ష్మినారాయణ పూర్తి స్థాయిలో కృషి చేస్తున్నారు. వీరి వ్యూహాలు ఎదుర్కోవడం జగన్ వర్గానికి కష్టంగానే మారింది. ఆదిలోనే జగన్ వర్గాన్ని దెబ్బ తీయాలనే లక్ష్యంతో వారు పనిచేస్తున్నారు. దీంతో ఈ ఎన్నిక జగన్‌కు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు.