ఎమ్మెల్సీ పోలింగ్ షురూ, కాంగ్రెసు వర్సెస్ వైయస్ జగన్ క్యాంప్
State
oi-Pratapreddy
By Pratap
|
హైదరాబాద్: రాష్ట్రంలో స్థానిక సంస్థల కోటా కింద జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సోమవారం ఉదయం ప్రారంభమైంది. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలతో పాటు వైయస్ జగన్ వర్గానికి చెందిన అభ్యర్థులు కూడా పోటీలో ఉండడంతో ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. ఎనిమిది జిల్లాలో తొమ్మిది ఎమ్మెల్సీ సీట్లకు పోలింగ్ జరుగుతోంది. మొత్తం 33 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. పోలింగ్ సందర్భంగా కొన్ని జిల్లాల్లో కాంగ్రెసు, జగన్ వర్గానికి మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. తిరుపతిలో పోలీసులు వైయస్ జగన్ వర్గానికి చెందిన నాయకుడు చెవిరెడ్డి భాస్కర రెడ్డిని అరెస్టు చేశారు. ఆయనను పోలీసు స్టేషన్‌కు తరలించారు.
పశ్చిమ గోదావరి జిల్లాలో వైయస్ జగన్ వర్గానికి చెందిన నాయకుడు మేకా శేషాబాబును పోలీసులు పోలింగ్ స్టేషన్ నుంచి బయటకు పంపించారు. శేషాబాబు పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. నెల్లూరులోని పోలింగ్ కేంద్రంలోకి బయటివారిని అనుమతిస్తున్నారంటూ జగన్ వర్గం నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ సమయంలో జగన్ వర్గానికి, కాంగ్రెసు కార్యకర్తలకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. కర్నూలు జిల్లాలో తమ ఓటర్లను కిడ్నాప్ చేశారంటూ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఆరోపించారు.
Polling in MLC election began today morning in 8 districts of the state. In some district YS Jagan camp and Congress clashed. YS Jagan camp leader Chevireddy Bhaskar Reddy arrested in Tirupati.
Story first published: Monday, March 21, 2011, 9:29 [IST]