ఎమ్మార్పీఎస్ ఛలో అసెంబ్లీ ఉద్రిక్తం, కార్యకర్తల అరెస్టు
State
oi-Srinivas G
By Srinivas
|
హైదరాబాద్: మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి కార్యకర్తలు సోమవారం అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నాలు చేశారు. దీనిని గమనించిన పోలీసులు పలువురు కార్యకర్తలను అరెస్టు చేశారు. పలువురు ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు సోమవారం అసెంబ్లీ జరుగుతున్న సమయంలో అనూహ్యంగా అసెంబ్లీని ముట్టడించడానికి విఫల యత్నం చేశారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే పార్లమెంటులో మాదిగ వర్గీకరణ బిల్లు ప్రవేశ పెట్టాలని వారు డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అందుకు ముందుకు రావాలన్నారు. వారిని గమనించిన పోలీసులు వారిని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా వారు ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆందోళకారులను అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు.
Police arrest MRPS followers today at assembly. MRPS followers trying to enter in to assembly. They demanded to propose reservation bill in parliament.
Story first published: Monday, March 21, 2011, 11:25 [IST]