హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ వర్గం కన్న గడాఫీ బెటర్: చంద్రబాబు పరోక్ష వ్యాఖ్య

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్: మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం స్థానిక సంస్థల శాసనమండలి ఎన్నికలలో సంతలో పశువుల మాదిరిగా ఓట్లను కొన్నారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబునాయుడు బుధవారం విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. తెలుగుదేశం పార్టీకి గతంలో ఒకే సీటు ఉండేదని, ఇప్పుడు అదనంగా రెండు సీట్లు గెలుచుకుందని అయినప్పటికీ ప్రజాస్వామ్యం కూనీ అయినందుకు చాలా బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేసారు. టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా ప్రభుత్వానికి ఎమ్మెల్యే కోటాలో జరిగిన ఎన్నికలలో అమ్ముడు పోయారన్నారు.

ఇలాంటి ఓట్లతో కొంటున్న డబ్బు రాజకీయం చూస్తుంటే మన నాయకులకన్నా లిబియా నేత మమ్మద్ గడాఫీయే బెటర్ అనిపిస్తోందని చంద్రబాబు అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె చంద్రశేఖరరావు వల్ల గత సాధారణ ఎన్నికల్లో 45 సీట్లు కోల్పోయామని చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికలలో జగన్ వర్గం, కాంగ్రెసు ఏకమయ్యాయని ఆరోపించారు. మా ఓట్లు ఎక్కడా కాంగ్రెసుకు పడలేదన్నారు. కొన్నిచోట్ల మాత్రం డబ్బులకు కొన్నారని అన్నారు. జగన్ తీరు, కెసిఆర్ తీరు చూస్తుంటే వారు కూడా చిరంజీవి బాటలో నడుస్తారని అనిపిస్తోందన్నారు.

గత సాధారణ ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వంకంటే కేంద్రానికి ఎక్కువ ఓట్లు పడ్డాయని అన్నారు. భూకేటాయింపులపై జెఎల్పీ వేయాల్సిందేనని చంద్రబాబు అన్నారు. భూకేటాయింపులపై హౌస్ కమిటీ వేస్తే నష్టమేమిటని అడిగారు. కమిటీ వేస్తే మంత్రులు, ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ పేర్లు బయటకు వస్తాయనే అడ్డుకుంటున్నారన్నారు.

English summary
TDP president Chandrababu Naidu said today that Libya president Gaddafi is better than Ex MP YS Jaganmohan Reddy. He blamed KCR and YS Jagan for vote for cash. He demanded government to JLP on land allocations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X