మహిళలూ.. పండుగకు రెడీ అవ్వండి.. రూ.1.30 లక్షల కోట్ల వడ్డీలేని రుణాలు త్వరలో!

తెలంగాణ ప్రభుత్వం మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తోంది. కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేయటం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలో తాజాగా మరో కీలకనిర్ణయం తీసుకున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం వెంకటాపురం గ్రామంలో మహిళా సమాఖ్యల ఆధ్వర్యంలో నిర్మించిన దేశంలోనే తొలి మహిళా నేతృత్వంలోని 1 మెగావాట్ సౌర విద్యుత్ కేంద్రాన్ని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి సీతక్కలు ప్రారంభించారు.

మహిళల కోసం ప్రభుత్వం ముందడుగు

సుమారు రూ. 3కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ సౌర విద్యుత్ ప్లాంట్ మహిళా సాధికారత దిశగా వేసిన ఒక కీలకఅడుగు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘాలకు రూ.10కోట్ల వడ్డీ లేని రుణాల చెక్కులను కూడా పంపిణీ చేశారు. అంతేకాకుండా, రూ. 1.30కోట్లతో నిర్మించనున్న పెట్రోల్ బంకుకు శంకుస్థాపన చేశారు. ఇది మహిళలు కేవలం ఇంటి పనులకు పరిమితం కాకుండా, పారిశ్రామిక రంగంలోకి అడుగుపెట్టడానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహంగా ఆయన పేర్కొన్నారు.

good news to telangana women Deputy CM Bhatti said zero-interest loans worth Rs 1 30 lakh crore

మహిళలను పారిశ్రామిక వేత్తలను చేయటం లక్ష్యం

ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ, మహిళలను అదానీ, అంబానీలా పారిశ్రామికవేత్తలుగా మార్చడమే మా లక్ష్యం అని స్పష్టం చేశారు. గత ప్రభుత్వాలు మహిళా సంఘాలను నిర్లక్ష్యం చేసినప్పటికీ, ప్రస్తుత ప్రభుత్వం మహిళా శక్తిని గుర్తించి వారి అభ్యున్నతికి అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు. వారోత్సవాల సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా 8 వేల మహిళా సమాఖ్య భవనాలకు శంకుస్థాపన చేశామని తెలిపారు.

రానున్నరోజుల్లో మహిళలకు రూ. 1.30 లక్షల కోట్ల వడ్డీలేని రుణాలు

గత రెండున్నరేళ్లలో మహిళా సంఘాలకు రూ. 66 వేల కోట్ల రుణాలు అందజేశామని, రాబోయే రెండున్నరేళ్లలో రూ. 1.30 లక్షల కోట్ల వడ్డీ లేని రుణాలు అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని ప్రకటించారు. మహిళా సంఘాల రుణ పరిమితిని రూ. 10 లక్షలకు పెంచినట్లు ప్రకటించారు.

నిరుద్యోగులకు తీపికబురు..త్వరలో భారీ ఉద్యోగాల జాతర!
నిరుద్యోగులకు తీపికబురు..త్వరలో భారీ ఉద్యోగాల జాతర!

మహిళల ఆర్ధిక స్వావలంబనకు ప్రభుత్వ నిర్ణయాలు

ఇలాంటి నిర్ణయాలు మహిళల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతాయని అన్నారు.మహిళల ఆర్ధిక స్వావలంబనకు ప్రభుత్వం అన్ని విధాలా దోహదం చేస్తుందని అన్నారు. మొత్తంగా తెలంగాణా ప్రభుత్వం మహిళల సమగ్రాభివృద్ధికి, అన్ని రంగాలలో పురోగతికి తగిన చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+