PM Kisan- అన్నదాత సుఖీభవ నిధుల జమపై బిగ్ అప్డేట్.. కీలక మార్పులు..!!

PM Kisan 23వ విడత నిధుల పైన కీలక అప్డేట్ వచ్చింది. కొత్త ఆర్దిక సంవత్సరంలో రెండో నెల ముగుస్తున్న వేళ కేంద్రం ఈ నిధుల విడుదలకు సంబంధించి కసరత్తు వేగవంతం చేసింది. కేంద్రం ఈ నిధుల విడుదల సమయంలోనే ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ నిధులను రైతు ల ఖాతాల్లో జమ చేయనుంది. కాగా.. చివరి సారిగా జమ చేసిన పీఎం కిసాన్ నిధుల్లో అర్హులైన చాలా మందికి నిధులు సకాలంలో జమ కాలేదు. దీంతో... ముందుగానే లబ్దిదారులకు కేంద్రం కీలక సూచన చేసింది. నిధులు అందాలంటే చేయాల్సిన విధానం పైన స్పష్టత ఇచ్చింది.

కేంద్రం ఏటా రూ 6 వేలు చొప్పున రైతులకు ఆర్దిక సాయం అందిస్తున్న పీఎం కిసాన్ తదుపరి విడత నిధుల పైన కసరత్తు మొదలు పెట్టింది. ఇప్పటికే ఈ పథకం కింద ప్రభుత్వం 22వ విడతల్లో రైతుల ఖాతాల్లో నిధులు జమ చేసింది. గత నెల 13నే గౌహతిలో ప్రధాని మోదీ 22వ విడత విడుదల చేశారు. దీంతో ఇప్పుడు రైతులంతా 23వ విడత కోసం ఆసక్తిగా ఎదురు చూస్ తున్నారు. 23వ విడత నిధులు జూన్ మూడో వారంలో విడుదల చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అదే విధంగా కేంద్రం అమలు చేసే పీఎం కిసాన్ నిధులకు.. ఏపీ ప్రభుత్వం ఏటా రూ 14 వేలు అర్హతలు ఉన్న రైతుల ఖాతాల్లో అన్నదాత సుఖీభవ పథకం కింద జమ చేస్తుంది. గతం ఏడాది మూడు విడతల నిధులు పీఎం కిసాన్ తో పాటుగా ఖాతాల్లో జమ చేసింది. ఇక, 2026-27 ఆర్దిక సంవత్సరంలో తొలి విడత నిధులను పీఎం కిసాన్ తో పాటుగా విడుదల చేయనుంది.

రూ.5కే ఫిష్ మీల్స్, సువేందు మార్క్ పథకం - దేశంలోనే తొలిసారి, అసలు టార్గెట్..!!
రూ.5కే ఫిష్ మీల్స్, సువేందు మార్క్ పథకం - దేశంలోనే తొలిసారి, అసలు టార్గెట్..!!
pm-kisan-yojana-annadata-sukhibava-funds-likely-to-release-in-second-week-of-june-as-latest-reports

ఒకే సమయంలో రెండు పథకాల నిధుల జమ

కాగా.. ఈ పథకాలకు సంబంధించి ఇప్పటికే మార్గదర్శకాల మేరకు నిధులు విడుదల చేస్తోంది. గతంలో పథకం కింద విడుదల చేసిన నిధులు కొందరు రైతులకు అందలేదనే ఫిర్యాదులు ఉన్నాయి. దీంతో.. ప్రభుత్వం కీలక మార్గదర్శకాలు విడుదల చేసింది. ప్రభుత్వం నుంచి వచ్చే పెట్టుబడి సాయం పొందాలంటే లబ్దిదారు మొబైల్ నంబర్ అప్‌డేట్‌గా ఉండాలని సూచిస్తు న్నారు. ఇందు కోసం మొబైల్ నంబర్ మీ ఆధార్ కార్డుతో లింక్ అయి ఉంటే, సులభంగా ఇ-కేవైసీ ద్వారా నంబర్ మార్చుకోవచ్చు ముందుగా PM కిసాన్ అధికారిక వెబ్‌సైట్ pmkisan.gov.in లాగిన్ అవ్వాలి. హోమ్‌పేజీలో ఉన్న 'Farmers Corner' సెక్షన్‌లోకి వెళ్లి e-KYC ఆప్షన్‌పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. అక్కడ 12 అంకెల ఆధార్ నంబర్‌ను నమోదు చేసి సెర్చ్‌పై పై క్లిక్ చేయటం ద్వారా అప్‌డేట్ చేయాలనుకుంటున్న కొత్త మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయాలి. గెట్‌ ఓటీపీ పై క్లిక్ చేస్తే, మొబైల్ నంబర్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలని.. దీంతో.. వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత నంబర్ అప్‌డేట్ అవుతుందని అధికారులు వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+