లిక్కర్ కేసులో జగన్ పీఏ కేఎన్ఆర్ విచారణ - ఆస్తుల చిట్టా..!!

లిక్కర్ కేసు విచారణలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే పలువురు వైసీపీ నేతల విచారణ.. అరెస్ట్ జరిగిన ఈ కేసులో మాజీ సీఎం జగన్ వ్యక్తిగత సహాయకుడు కేఎన్ఆర్ ను సిట్ విచారణ చేసింది. పలు ఆర్దిక లావాదేవీల పైన ఆరా తీసినట్లు తెలుస్తోంది. పెద్ద మొత్తంలో ఆస్తులు కూడ బెట్టటం పైన లోతుగా విచారణ చేసినట్లు సమాచారం. అయితే, కేఎన్ఆర్ నుంచి దాటవేసే విధంగా సమాధానాలు వచ్చాయని చెబుతున్నారు. దీంతో.. మరోసారి నాగేశ్వర రెడ్డి విచారణకు అధికారులు నిర్ణయించారు.

లిక్కర్ స్కాంలో చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డికి సంబంధించిన లావాదేవీల్లో కేఎన్‌ఆర్‌ ఆస్తులు వెలుగులోకి వచ్చాయి. వాటి ఆధారంగా విచారణకు పిలిపించి సిట్‌ అధికారులు ప్రశ్నించారు. ఇళ్లు, వ్యాపారాలతో పాటుగా స్థిరాస్తులు.. భార్య బ్యాంకు ఖాతాలో సుమారు 20 కోట్ల రూపాయల వరకూ లావాదేవీ లను గుర్తించినట్లు తెలుస్తోంది. తిరుపతి జిల్లా కేవీబీ పురం మండలంలో ఒల్లూరు వద్ద కేవీఆర్‌ ఇన్‌ఫ్రా పేరుతో వేసిన 47ఎకరాల లే అవుట్‌ వివరాలు బయట పడ్డాయి. అందులో నుంచి ఆస్తులు కొనుగోలు చేసిన వారిలో జగన్‌ వద్ద వ్యక్తిగత సహాయకుడిగా పనిచేస్తున్న కేఎన్‌ఆర్‌ పేరిట పదెకరాలు 2021లో రిజిస్టర్‌ అయినట్లు తేలింది. ఎకరా రూ.8 లక్షల చొప్పున పదెకరాల ఆస్తిని కేఎన్‌ఆర్‌ రూ.81 లక్షలకు కొనుగోలు చేసినట్లు గుర్తించారు. దీంతో ఆయనకు సిట్‌ అధికారులు నోటీసులిచ్చి విచారణకు పిలిచారు.

 PM Kisan- అన్నదాత సుఖీభవ నిధుల జమపై బిగ్ అప్డేట్.. కీలక మార్పులు..!!
PM Kisan- అన్నదాత సుఖీభవ నిధుల జమపై బిగ్ అప్డేట్.. కీలక మార్పులు..!!
sit-investigates-alleged-liquor-scam-involving-ys-jagan-s-aide-nageswara-reddy-tracks-cash-transac

రెండో రోజూ సిట్ విచారణ

విజయవాడలోని పోలీస్‌ కమిషనరేట్‌ ప్రాంగణంలో ఉన్న సిట్‌ ఆఫీసుకు బుధవారం ఉదయం పది గంటలకు న్యాయవాదులతో కలిసి వచ్చిన కేఎన్‌ఆర్‌ను సాయంత్రం 7.30 వరకూ సిట్‌ అధికారులు ప్రశ్నించారు. చెవిరెడ్డి కుటుంబానికి చెందిన కేవీఆర్‌ ఇన్‌ఫ్రాలో పదెకరాల భూమి కొనుగోలు చేయడానికి రూ.81 లక్షల డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని సిట్‌ అధికారులు ప్రశ్నించారు. తనకు గుర్తులేదని, ఆడిటర్‌ చూసుకుంటారని కేఎన్‌ఆర్‌ బదులిచ్చినట్లు సమాచారం. తనకు విజయవాడలో కార్ల షోరూమ్‌లో భాగస్వామ్యం ఉందని, బామ్మర్ది రఘునాథ్‌ రెడ్డి పేరుతో ఉన్న ఐటీ కంపెనీలో భార్య శశికళకు వాటా ఉందని వెల్లడించినట్లు తెలిసింది. కాగా, లిక్కర్‌ స్కామ్‌లో కీలక నిందితులందరితోనూ కేఎన్‌ఆర్‌ నిరంతరం ఫోన్‌లో మాట్లాడినట్లు సిట్‌ కాల్‌ డేటా సేకరించింది. కేఎన్ఆర్ కు బెంగళూరులో రెండు ఫ్లాట్లు, తిరుపతిలో మరో రెండు ఉన్నట్లు గుర్తించారు. హైదరాబాద్‌, కడప, విజయవాడలో ఇళ్ల నిర్మాణం చేపట్టినట్లు నిర్దారించారు. ఇక..
విజయవాడ లో కార్ల షోరూమ్‌, హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో వాటా తో పాటుగా జగ్గయ్యపేట ప్రాంతంలో 40 ఎకరాల వ్యవసాయ భూమి, ప్రకాశం జిల్లా దర్శిలో పదెకరాలు, భోగాపురం విమానాశ్రయం వద్ద భారీగా భూములు ఉన్నట్లు గుర్తించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+