హైదరాబాద్:
మాజీ
పార్లమెంటు
సభ్యుడు
వైయస్
జగన్మోహన్
రెడ్డికి
ఐటి
నోటీసులు
ఇచ్చినందున
నేరుగా
జైల్లో
కూడా
పెట్టవచ్చునని
రాష్ట్ర
ఆరోగ్య
శాఖమంత్రి
డిఎల్
రవీంద్రారెడ్డి
అన్నారు.
తన
తండ్రి
దివంగత
ముఖ్యమంత్రి
వైయస్
రాజశేఖరరెడ్డి
హయాంలో
అవినీతికి
పాల్పడి
రాష్ట్రాన్ని
అమ్ముకున్న
జగన్‌ను
పార్టీలో
ఎలా
చేర్చుకుంటామని
అడిగారు.
జగన్‌ను
కాంగ్రెసులో
చేర్చుకునేది
లేదని
చెప్పారు.
కాంగ్రెసుపై
నిత్యం
విరుచుకు
పడే
అంబటి
రాంబాబు
అడ్రసు
లేని
వాడన్నారు.
వైయస్
హయాంలో
జరిగిన
భూకేటాయింపులపై
ప్రతిపక్షం
జెఎల్పీ
వేయమని
డిమాండ్
చేస్తుందని
అందుకు
ముఖ్యమంత్రి
కిరణ్
కుమార్
రెడ్డి
సిద్ధంగా
ఉన్నారన్నారు.
అయితే
జెఎల్పీ
కంటే
సిబిఐ
విచారణతోనే
నిజాలు
వెలుగులోకి
వస్తాయని
ఆయన
అన్నారు.
స్థానిక
శాసన
మండలి
ఎన్నికలలో
పార్టీ
వ్యతిరేక
కార్యకలాపాలకు
పాల్పడ్డ
వారిపై
తప్పకుండా
చర్యలు
తీసుకోవాలన్నారు.
పార్టీని
ధిక్కరించిన
వారిపై
చర్యలు
తీసుకోవాలన్నారు.
జగన్
వర్గం
నేతలు
అవినీతి
సొమ్ముతో
ఓటర్లను
కొనుగోలు
చేశారన్నారు.
కాంగ్రెసు,
టిడిపి
మధ్య
మ్యాచ్
ఫిక్సింగ్
లేదన్నారు.
జగన్
-
టిడిపి
మధ్యే
మ్యాచ్
ఫిక్సింగ్
జరిగిందని
ఆయన
ఆరోపించారు.
తూర్పు
గోదావరి
జిల్లాలో
టిడిపి
గెలవడమే
ఇందుకు
మంచి
నిదర్శనమన్నారు.
డబ్బుతో
ఓటర్లను
కొనడం
శోచనీయమన్నారు.
ఈ
ఎన్నికలలో
ఓటమికి
ఎవరూ
నైతికంగా
బాధ్యత
వహించాల్సిన
అవసరం
లేదన్నారు.
డబ్బుతో
ఓటర్లను
కొన్నప్పటికీ
కాంగ్రెసు
పార్టీ
కొద్ది
తేడాతోనే
ఓడిందన్నారు.
కాంగ్రెసు
పార్టీకి
ఓటు
వేసి
అభ్యర్థులను
గెలిపించిన
జెడ్పీటీసులు,
ఎంపీటీసులకు
ఆయన
కృతజ్ఞతలు
తెలిపారు.
Minister DL Ravindra Reddy fired at Ex MP YS Jaganmohan Reddy today. He condemned Congress-TDP match fixing. He said that CM Kiran Kumar Reddy is ready for JLP. He said government have a chance to sentenced Jagan with IT notice.
Story first published: Wednesday, March 23, 2011, 16:31 [IST]