హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అనుకున్నదొకటి, అయింది మరోటి: ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై డి శ్రీనివాస్

By Srinivas
|
Google Oneindia TeluguNews

D Srinivas
హైదరాబాద్: ఎన్నికల నివేదికను జిల్లా అధ్యక్షుల నుండి తెప్పించుకొని ఆ తర్వాత ఎన్నికల ఓటమిపై మాట్లాడుతామని చెప్పారు. ఎన్నికలలో ఓటమికి ఇప్పటికిప్పుడు ఎవరినీ నిందించమని, కొన్ని ఆరోపణలు కొందరిపై వస్తున్నప్పటికీ విశ్లేషణ, దర్యాప్తు తర్వాత మాట్లాడుతామని చెప్పారు. ఈ ఓటమికి నైతిక బాధ్యత ఎవరిదీ కాదని, సమష్టి బాధ్యత అన్నారు. ఓటమిలో జిల్లా నాయకులతో పాటు రాష్ట్ర నాయకుల బాధ్యత కూడా ఉందన్నారు. ఫలితాలు అనుకున్న రీతిలో రాలేదన్నారు.

ప్రలోభాలు ఎన్నికలలో ఎంత మేరకు ప్రభావితం చూపిస్తాయో అందరికీ తెలిసిందే అన్నారు. ఏమైనా పొరపాట్లు ఉంటే సరిదిద్దుకుంటామని చెప్పారు. క్రాస్ ఓటింగ్‌పై నిజనిర్ధారణ చేసుకున్న తర్వాతే మాట్లాడుతానన్నారు. వాస్తవాలు తెలియకుండా వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సొంత జిల్లా చిత్తూరులో ఓటమికి కూడా రిపోర్టులు తెప్పించాక మాట్లాడతామని చెప్పారు.

English summary
PCC chief D Srinivas said today that they will make postmortem on MLC election. He was disappointed very much with results. He accused that oppositions bend voters with money.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X