హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

శ్రీకృష్ణ కమిటీ నివేదికలోని 8వ అధ్యాయంలోని రహస్యాలు ఇవే

By Pratap
|
Google Oneindia TeluguNews

BN Srikrishna
హైదరాబాద్: శ్రీకృష్ణ కమిటీ నివేదికలోని ఎనిమిదో అధ్యాయంలో విస్తుగొల్పే విషయాలున్నాయి. ఈ అధ్యాయాన్ని వెల్లడించకూడదని చెబుతూ శ్రీకృష్ణ కమిటీ దాన్ని హోం మంత్రి పి. చిదంబరానికి అందజేసిన విషయం తెలిసిందే. దాన్ని వెల్లడించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు బుధవారం ప్రతిస్పందించింది. దాన్ని ప్రజలకు వెల్లడించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో జీ 24 గంటలు టీవీ చానెల్ ఎనిమిదో అధ్యాయంలో గల అంశాలను బయటపెట్టింది. ఆ విషయాలు ఆశ్చర్యం కలిగించే విధంగా ఉన్నాయి. అన్నీ రాజకీయపరమైన అంశాలే కావడం, కేంద్ర ప్రభుత్వం ఎలా వ్యవహరించాలో చెప్పడం విశేషం.

శ్రీకృష్ణ కమిటీ నివేదికలోని ఎనిమిదో అధ్యాయంలోని అంశాలు ఇలా ఉన్నాయి - రాయల తెలంగాణ ఏర్పాటు చేస్తే మజ్లీస్, బిజెపి బలపడతాయి. తెలంగాణ ఇస్తే మతఘర్షణలు పెరిగే ప్రమాదం ఉంది. తెలంగాణ ఉద్యమాన్ని తెలంగాణ ప్రాంతానికి జర్నలిస్టులు కవర్ చేస్తున్నారు కాబట్టి తెలంగాణ ఉద్యమాన్ని ఎక్కువ చేసి చూపుతున్నారు. హైదరాబాదులో సీమాంధ్రుల పెట్టుబడులే ఎక్కువ. అందువల్ల తెలంగాణ ఏర్పడితే పెట్టుబడులు తరలిపోతాయి. దాంతో హైదరాబాదు ఉనికి కోల్పోతుంది. మీడియా మేనేజ్‌మెంట్ సాధ్యం కాదు. శాంతిభద్రతలు అదుపు తప్పుతాయి.

హైదరాబాదు మావోయిస్టుల అడ్డాగా మారుతుంది. తీవ్రవాద కార్యకలాపాలు పెరుగుతాయి. అధికార పార్టీ నాయకులు ఐక్యంగా ఉండాలి. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పదవులు తెలంగాణవారికి ఇవ్వాలి. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)ని బుజ్జగించాలి. రాష్ట్రంలోని 13 టీవీ చానెళ్లలో రెండు మాత్రమే తెలంగాణకు అనుకూలంగా ఉన్నాయి. ఉద్యమాలను గాయాలు కాకుండా అణచివేయాలి. సాధ్యమైనంత త్వరగా ఆందోళనలను అదుపుచేయాలి. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లోనూ పూర్తి స్థాయిలో బలగాలను మోహరించాలి.

English summary
The issues dealt by Srikrishna Committee in its eighth chapter is revealed by a Telugu News Channel. Srikrishna committee suggested Union Government not disclose 8th chapter.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X