హైదరాబాద్: ప్రముఖ సినీ నటుడు నాగార్జున ఇంటిపై ఆదాయం పన్ను శాఖ అధికారులు దాడి చేశారు. అక్కినేని వెంకట్ ఇంట్లో కూడా ఐటి అధికారులు సోదాలు నిర్వహించారు. అక్కినేని నాగేశ్వరరావుకు, ఆయన కుటుంబ సభ్యులకు చెందిన అన్నపూర్ణ స్టూడియోస్, అక్కినేని గ్రూపు సంస్థల్లో ఐటి సోదాలు జరిగాయి. ఎఎన్ఆర్ గ్రూపు సంస్థల్లో ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. హీరో రవితేజ, హీరోయిన్ అనుష్క ఇళ్లలో కూడా ఐటి అధికారులు సోదాలు చేస్తున్నారు. కొంత మంది నిర్మాతల ఇళ్లలో కూడా సోదాలు జరిగాయి. కామాక్షి మూవీస్ అధినేత శివప్రసాద్ రెడ్డి ఇంటిలో కూడా సోదాలు నిర్వహించారు.
హైదరాబాదు, చెన్నై, బెంగళూర్‌ల్లో ఐటి అధికారులు సోదాలు చేస్తున్నారు. మొత్తం 15 బృందాలు ఎఎన్ఆర్ సంస్థల్లో బుధవారం ఉదయం నుంచి సోదాలు చేస్తున్నారు. ఈ సోదాలు ఇంకా జరిగే అవకాశం ఉంది. నాగార్జున పెద్ద యెత్తున డబ్బులు పెట్టి భూమి కొనుగోలు చేసినట్లు ఐటి అధికారులు గుర్తించారు. దీనిపై వారు ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ముందస్తు పన్ను అంచనాల్లో లోపాలు జరిగాయని, ఆదాయానికి తగిన పన్ను చెల్లించలేదని అనుమానాలు రావడంతో ఐటి అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.
IT officers raided residences of hero Nagarjuna, Ravi Teja and heroine Anushka. They also raided Akkineni Group offices and institutions. Raids are continuing in Hyderabad, Chennai and Bangalore.
Story first published: Wednesday, March 23, 2011, 12:18 [IST]