చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సొంత జిల్లాలో సిఎం కిరణ్ కుమార్ రెడ్డికి షాక్: జగన్ వర్గం విన్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy
చిత్తూరు: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి సొంత జిల్లా చిత్తూరులో ఘోర పరాభవం ఎదురయింది. కాంగ్రెసు అభ్యర్థిపై మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం అభ్యర్థి తిప్పారెడ్డి గెలుపొందారు. మొదటిసారి కౌంటింగ్ జరిపినపుడు కాంగ్రెసు పార్టీ అభ్యర్థిపై జగన్ అభ్యర్థి ఒక్క ఓటు మెజారిటీతో ఉన్నారు. దీంతో కాంగ్రెసు పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. రీకౌంటింగ్‌కు పట్టుబట్టింది. అయితే జగన్ వర్గం మాత్రం రీకౌంటింగ్‌ వద్దంటూ ఆందోళన చేసింది. ఎట్టకేలకు రీకౌంటింగ్ జరిపారు. రీకౌంటింగ్‌లో కూడా జగన్ వర్గం అభ్యర్థి గెలిపొందాడు.

జగన్ వర్గం అభ్యర్థి గెలుపొందటంతో ముఖ్యమంత్రి కిరణ్‌కు పెద్ద షాక్. ముఖ్యమంత్రి కిరణ్‌కు ప్రధాన ప్రత్యర్థి అయిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జగన్ వర్గాన్ని గెలిపించడానికి తీవ్రంగా కృషి చేశారు. సిఎం, పెద్దిరెడ్డి ఇద్దరూ కాంగ్రెసు పార్టీలోనే ఉన్నప్పటికీ వారి ఇద్దరి మధ్య కలహం మాత్రం ఏళ్లుగా కొనసాగుతోంది. దీంతో పెద్దిరెడ్డి జగన్ వర్గం అభ్యర్థిని గెలిపించి సింకు షాక్ ఇస్తానని ప్రకటించారు. పెద్దిరెడ్డి తాను చెప్పినట్టే కాంగ్రెసు అభ్యర్థిని ఓడించి సిఎం కిరణ్ కుమార్ రెడ్డికి గట్టి షాక్ ఇచ్చాడు. దీంతో సొంత జిల్లాలోనే కిరణ్ కుమార్ ఎమ్మెల్సీ సీటును గెలిపించుకోలేక పోయారనే అపకీర్తిని మూటగట్టుకున్నారు.

ఎన్నికలు జరిగిన తొమ్మిది సీట్లలో కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీ, జగన్ వర్గం మూడు మూడు సీట్లు గెలుచుకున్నాయి. టిడిపికి గతంలో ఒక్క సీటు ఉండగా ఇప్పుడు రెండు సీట్లు అదనంగా గెలుచుకుంది. జగన్ వర్గం మూడు సీట్లు కైవసం చేసుకుంది. దీంతో ఎటూ నష్టపోయింది కాంగ్రెసు పార్టీయే. ఎమ్మెల్యే కోటాలో చావుతప్పి కన్నులొట్టబోయిన చందంగా తన అభ్యర్థులను గెలిపించుకున్న సిఎం కిరణ్ స్థఆనిక సంస్థల ఎన్నికల్లో మాత్రం తన సొంత జిల్లా అభ్యర్థినే గెలిపించుకోలేక పోయారు.

English summary
Very shock to CM Kiran Kumar Reddy in mlc election. Congress candidate defeated in mlc election.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X