రజనీకాంత్ మద్దతు కోసం తమిళ రాజకీయ పార్టీల పాట్లు

అన్నాడీఎంకే అధ్యక్షురాలు జయలలిత తరఫున 'తుగ్లక్" పత్రిక సంపాదకుడు చో రామస్వామి వారం రోజుల కిందట రజనీకాంత్‌ను కలుసుకున్నారు. ప్రత్యేకంగా ప్రచారం చేయాల్సిన పనిలేదని, అభిమానులకు సూచనప్రాయంగా చెబితే చాలని రామస్వామి అన్నట్లు సమాచారం. ఆయనకు కూడా రజనీకాంత్ ఎలాంటి హామీ ఇవ్వకుండానే 'పైన భగవంతుడు ఉన్నాడు" అని సాగనంపినట్లు తెలిసింది.
రెండు ప్రధాన పార్టీలూ తన మద్దతు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నా, రజనీకాంత్ మాత్రం ఎవరినీ నొప్పించకుండా తప్పించుకుంటున్నారు. రజనీకాంత్ తొలి సారిగా 1996లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ- డీఎంకే కూటమికి ఆయన ప్రచారం చేశారు. రజనీకాంత్ నుంచి ఓ మాట వస్తే చాలు, ఆయన అభిమానులు రంగంలోకి దూకుతారని తెలిసి పార్టీలు ఆ ప్రయత్నాలు సాగిస్తున్నాయి.












Click it and Unblock the Notifications