జగన్ రాష్ట్రాన్ని దోచాడు ముఖ్యమంత్రి ఐతే ఇక అంతే: విహెచ్

కాంగ్రెసు అవినీతిని సహించదన్నారు. 2జి స్పెక్ట్రంలో డిఎంకె అవినీతిని, ఆదర్శ్ కుంభకోణంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రిని, కామన్వెల్తు కుంభకోణంలో సురేష్ కల్మాడీపై కాంగ్రెసు పార్టీ వేటు వేసిన విషయాన్ని గుర్తు చేశారు. కాంగ్రెసు పార్టీ ప్రజల విశ్వాసాన్ని నిరూపించుకోవాలంటే జగన్ ఆస్తులపై విచారణ చేయించాలన్నారు. తండ్రి ఉండగానే జగన్ రాష్ట్రాన్ని దోచుకున్నారని, ఇక ఆయన పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం ఉంటుందా అని అన్నారు.
తండ్రి ముఖ్యమంత్రిగా ఉండటాన్ని ఆయన అడ్వాంటేజ్‌గా తీసుకొని సంపాదించారని ఆరోపించారు. వైయస్ మరణించినందువల్ల ఆయనపై తానేమీ వ్యాఖ్యానించనని చెప్పారు. జగన్ ప్రజలకు తాను ఎలా డబ్బు సంపాదించానో బయట పెట్టాలన్నారు. ప్రజలు అమాయకులు కాదన్నారు. వారికి అన్నీ తెలుసన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమికి, అవినీతికి సంబంధం లేదన్నారు.












Click it and Unblock the Notifications