హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణపై టిడిపి హామీ నిలబెట్టుకోలేదు: పోచారం శ్రీనివాస్‌రెడ్డి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Pocharam Srinivas Reddy
హైదరాబాద్: బాన్సువాడ నియోజకవర్గం శాసనసభ్యుడు పోచారం శ్రీనివాస్‌రెడ్డి శుక్రవారం డిప్యూటీ స్పీకర్ నాదెండ్ల మనోహర్‌కు తన రాజీనామాను సమర్పించే ముందు అసెంబ్లీ ఎదుట ఉన్న తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించి అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ గత సాధారణ ఎన్నికలలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేక పోయిందన్నారు. గత ఎన్నికల్లో తెలంగాణకు అనుకూలం అని చెప్పి తెలంగాణ రాష్ట్ర సమితితో పొత్తు పెట్టుకుని ఇప్పుడు అందుకు వ్యతిరేకంగా పార్టీ అధిష్టానం నిర్ణయం ఉన్నదని అందుకే టిడిపికి రాజీనామా చేసి, ఇప్పుడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయబోతున్నట్టు చెప్పారు.

టిఆర్ఎస్‌లో చేరి ఉద్యమాన్ని ఉధృతం చేస్తానని చెప్పారు. అందుకే ఎమ్మెల్యే పదవికి రాజీనా చేస్తున్నట్టు చెప్పారు. ఏ పార్టీలోని వారైనా తెలంగాణ ఉద్యమం కోసం ముందుకు రావాలన్నారు. లేదంటే ప్రజలు క్షమించరన్నారు. అసెంబ్లీలో మాట్లాడి డిప్యూటీ స్పీకరు నాదెండ్ల మనోహర్‌కు రాజీనామాను అందజేస్తానని అన్నారు. అసెంబ్లీలో మాట్లాడనివ్వకుండా అక్కడే రాజీనామా పత్రాన్ని అందజేస్తానన్నారు. అనంతరం ఆయన డిప్యూటీ స్పీకర్‌తో సమావేశమయ్యారు.

English summary
TDP Pocharam Srinivas Reddy said today that Telugudesam is not confident on his promise which is given in 2009 election on Telangana issue. He said he will submit his resignation to deputy speaker today in assembly.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X