సీమాంధ్రులతో కూర్చునేది లేదు: ఎంపీ సర్వే సత్యనారాయణ

తెలంగాణ ఎంపీలతో సమావేశమైన ఆజాద్ ఆ తర్వాత సీమాంధ్ర ఎంపీలతో కలిసి మరో భేటీ ఏర్పాటు చేస్తామని చెప్పగా అందుకు తెలంగాణ ఎంపీలు తిరస్కరించినట్లుగా తిరస్కరించారు. వారి అభిప్రాయాలతో తాము ఏకీభవించలేమని, మా ప్రాంత పరిస్థితుల దృష్ట్యా వారితో కలసి భేటీని ఒప్పుకునేది లేదని ఖరాఖండిగా చెప్పినట్లుగా తెలుస్తోంది. ఐదు రాష్ట్రాల ఎన్నికలు ఉన్నందున మే 10 వరకు ఆగుతామని ఆ తర్వాత మాత్రం ఆగలేమని వారు చెప్పారు. కావాలంటే కార్యకర్తలుగా కొనసాగుతామని చెప్పారు. తాము గత్యంతరం లేకనే ఒత్తిడి తీసుకు వస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ ప్రకటించకుంటే గత్యంతరం లేని పరిస్థితుల్లో పదవులకు రాజీనామా చేసే పరిస్థితి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications