మూడు రోజుల పాటు వందేళ్ల చిత్తూరు జిల్లా వేడుకలు: రఘువీరా

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చిత్తూరు జిల్లాకు చెందినవారేనని, ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ఈ జిల్లాకు చెందినవారేనని ఆయన చెప్పారు. ఉత్సవాలకు చంద్రబాబుతో పాటు తిరుపతి నుంచి శాసనసభకు ఎన్నికైన చిరంజీవిని కూడా ప్రభుత్వం ఆహ్వానిస్తుందని ఆయన చెప్పారు. మాజీ మంత్రులను, అధికారులను, కళాకారులను, తదితరులను ఈ సందర్భంగా ఘనంగా సన్మానించనున్నట్లు ఆయన తెలిపారు. జిల్లాలో పనిచేసిన కలెక్టర్లను, ఎస్పీలను, తదితరులను కూడా ఆహ్వానిస్తామని ఆయన చెప్పారు. ఈ మీడియా ప్రతినిధుల సమావేశంలో జిల్లాకు చెందిన మంత్రి గల్లా అరుణ కుమారి కూడా పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications