అసెంబ్లీలో వైయస్ వివేకానంద రెడ్డి వాడిన బూతు చెప్పిన మోత్కుపల్లి

అసెంబ్లీకి చెడ్డపేరు తీసుకు వస్తున్నారన్నారు. మంత్రి వివేకానందరెడ్డిని సస్పెండ్ చేయాలని తెలంగాణ టిడిపి ఫోరం నుండి డిమాండ్ చేస్తున్నామన్నారు. తెలుగుదేశం శాసనసభ్యులు చాలా రోజులనుండి దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి హయాంలో జరిగిన భూకేటాయింపులపై జెఎల్పీ వేయాల్సిందిగా శాంతియుతంగా అసెంబ్లీలో పోరాడుతుందన్నారు. కానీ మంత్రి, జగన్ వర్గం ఎమ్మెల్యేలు గూండాల్లా వ్యవహరిస్తూ టిడిపి సభ్యులపై దాడి చేయడం హేయమైన చర్య అన్నారు. సభా హక్కుల ఉల్లంఘన జరిగిందన్నారు. మంత్రి వెంటనే రాష్ట్ర ప్రజలకు, సభ్యులకు క్షమాపణ చెప్పాలన్నారు. దీనిని ప్రజాస్వామిక వాదులు అందరూ ఖండించాలన్నారు. వివేకానందరెడ్డికి భూకేటాయింపుల అక్రమాలలో వాటాలు ఉన్నందుకే దాడి చేశారా అని ప్రశ్నించారు. తన భూకబ్జాలు బయటపడుతుందనే వివేకా దాడి చేశారని అన్నారు. ఎమ్మెల్యేలను కొట్టడం సభాహక్కుల ఉల్లంఘనే అన్నారు.
రంగారెడ్డి జిల్లా భూములు అన్నింటిని వైయస్ హయాంలో దోచుకున్నారని ఎమ్మెల్యే హరీశ్వర్‌రెడ్డి అన్నారు. బడ్జెట్ సెషన్స్‌ను నడిపించడంలో డిప్యూటీ స్పీకరు నాదెండ్ల విఫలమయ్యారన్నారు. భూకేటాయింపులపై చంద్రబాబు హయాంలో జరిగిన వాటికి కూడా జెఎల్పీ వేసుకోవచ్చునని డిమాండ్ చేశారు. కాంగ్రెసులో జగన్ వర్గం ఒకటి ఉందని వాళ్లు కూడా దాడి చేయడం శోచనీయమన్నారు. వివేకాను మంత్రివర్గంనుండి బర్తరఫ్ చేయకుంటే ప్రభుత్వానికే మరక అన్నారు. సభ నడిపించడంలో విఫలమైన డిప్యూటీ స్పీకర్ ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు.