గందరగోళం మధ్య ద్రవ్య వినిమయ బిల్లును ఆమోదించిన అసెంబ్లీ

Kiran Kumar Reddy
హైదరాబాద్: ప్రతిపక్షాల గందరగోళం మధ్య ప్రభుత్వం మంగళవారం ద్రవ్యవినిమయ బిల్లును మంగళవారం శాసనసభ ఆమోదించింది. అంతకుముందు ప్రతిపక్షాలు దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి హయాంలో జరగిన భూకేటాయింపులపై హౌస్ కమిటీపై చర్చించిన తర్వాతే ద్రవ్య వినిమయ బిల్లు ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేసింది. భూకేటాయింపులు, హసన్ అలీ వ్యవహారంపై చర్చించాలని చంద్రబాబుతో సహా ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. వీటిపై చర్చించిన తర్వాత ద్రవ్యవినిమయ బిల్లుకు సహకరిస్తామని చెప్పాయి. వారు ఆందోళన చేస్తుండగానే ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ద్రవ్య వినిమియ బిల్లును సభలో ప్రతిపాదించారు. చర్చ లేకుండానే బిల్లును సభ ఆమోదించింది.

అయితే ఆర్థిక శాఖమంత్రి ఆనం రామనారాయణ రెడ్డి విపక్షాల తీరును తప్పు పట్టారు. చంద్రబాబు తనకు ఎవరి మీద నమ్మకం లేనట్లుగా మాట్లాడుతున్నారని అన్నారు. అధికార పార్టీకి స్పష్టమైన ఆధిక్యం ఉన్నప్పటికీ రాజ్యాంగపరంగా వెళ్లాలనే తాము అనుకుంటున్నామని చెప్పారు. చంద్రబాబు మాట్లాడిన వ్యాఖ్యలను ఖండించనప్పటికీ వాటిని రికార్డులనుండి తొలగించాలని ఆయన ఉప సభాపతి నాదెండ్ల మనోహర్‌ను కోరారు.

అనంతరం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా విపక్షాలను బిల్లు ఆమోదానికి సహకరించాలని కోరారు. ద్రవ్యవినిమయ బిల్లు ప్రవేశ పెట్టడంలో ఎలాంటి మతలబు లేదన్నారు. బిల్లును ఇక్కడ ఆమోదింపజేసి ఇక్కడినుండి శాసనమండలికి పంపించాల్సిన అవసరం ఉందన్నారు. శాననమండలి చైర్మన్, ఉపాధ్యక్షుల పదవీ కాలం నేటితో ముగుస్తున్నందునే బిల్లుకు సహకరించాలని కోరుతున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు. ప్రభుత్వం భూకేటాయింపులపై ఏమైనా పొరపాట్లు చేస్తే ఎత్తి చూపండని అన్నారు. భూకేటాయింపులపై ప్రభుత్వం ఎలాంటి పొరపాట్లు చేయలేదన్నారు.

కాగా భూకేటాయింపులపై హౌస్ కమిటీని తాము ఈరోజు అడగటం లేదని టిడిపి ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర అన్నారు. చాలా రోజులనుండి అడుగుతున్నామని చెప్పారు. అధికార పార్టీలో చీలిలకు ఉన్నందునే కమిటీ వేయానికి ప్రభుత్వం ఒప్పుకోవడం లేదన్నారు. అయితే విపక్షాలు భూకేటాయింపులపై పట్టుబట్టడంతో ప్రభుత్వం గందరగోళం మధ్య ద్రవ్యవినిమయ బిల్లును ప్రవేశ పెట్టింది. చివరకు ఎటువంటి చర్చ లేకుండానే బిల్లు ఆమోదం జరిగింది. దీంతో విపక్షాలు స్పీకర్ పోడియం వద్దకు వెళ్లారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+