హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్రబాబుపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఎదురు దాడి

By Pratap
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy
హైదరాబాద్‌: భూకేటాయింపులపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుపై ఎదురు దాడికి దిగారు. భూ కేటాయింపులపై జరిగిన చర్చకు ఆయన మంగళవారం సాయంత్రం శాసనసభలో సమాధానమిచ్చారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలకు తెలుగుదేశం సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రహేజాకు భూములు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చారని, ఎవరు ఎక్కువ భూములు ఇచ్చారో వారే గొడవ చేస్తున్నారని ముఖ్యమంత్రి అన్నారు. దీనికి తెలుగుదేశం సభ్యులు తీవ్ర అభ్యంతరం చెప్పారు. దీనికి ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేస్తూ మీరు ఇవ్వలేదా భూమి అని అడిగారు.

రద్దు చేయడానికి చట్టపరమైన ఇబ్బందులు వచ్చాయని, మనకు రావాల్సిన డబ్బు మనం తప్పకుండా తీసుకుంటామని ఆయన చెప్పారు. తక్కువ ఈక్విటీకి తెలుగుదేశం ప్రభుత్వం రహేజాకు ఇచ్చారని ఆయన చెప్పారు. ఎమ్మార్ ప్రాపర్టీస్‌కు 525 ఎకరాలు కూడా చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే ఇచ్చారని ఆయన చెప్పారు. ఈ సందర్బంగా అభ్యంతరం చెప్పిన తెలుగుదేశం సభ్యుడు గాలి ముద్దుకృష్ణమ నాయుడిపై ముఖ్యమంత్రి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుపై మీరేం మాట్లాడారో చెప్తే రాజకీయ సన్యాసం చేయాల్సి వస్తుందని ఆయన అన్నారు.

విదేశాల నుంచి పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చే పారిశ్రామికవేత్తలకు తక్కువ ధరకు భూములు కేటాయించాల్సి ఉంటుందని, అలాగే నీరు, విద్యుచ్ఛక్తి రేట్లలో రాయితీలు ఇవ్వాల్సి ఉంటుందని, పన్నుల్లో రాయితీ కూడా ఇవ్వాల్సి ఉంటుందని, ఇతర రాష్ట్రాలతో పోటీ పడాలంటే ఇది తప్పదని ముఖ్యమంత్రి అన్నారు. ప్రత్యేక ఆర్థిక మండళ్ల (సెజ్)ల విషయంలో భూకేటాయింపుల విషయంలోనే సమస్య వస్తోందని, భూకేటాయింపులపై తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో విమర్శలు వచ్చాయని, ఇప్పుడు తమ ప్రభుత్వ హయాంలో వస్తున్నాయని, భూ కేటాయింపుల విషయంలో నిర్దిష్టమైన వైఖరిని అవలంబించకపోవడం వల్ల ఈ సమస్య వస్తోందని ఆయన అన్నారు. ప్రగతిశీల ముఖ్యమంత్రిగా పేరు పొందిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఎందుకు ఇప్పుడు విమర్సిస్తున్నారో అర్థం కావడం లేదని ఆయన అన్నారు. సెజ్‌లకు మొత్తం 42 వేల 107 ఎకరాలు మాత్రమే ఇచ్చామని, ఇందులో పట్టా భూములు 28 వేల 107 ఎకరాలు మాత్రమేనని ఆయన చెప్పారు.

భూములు తీసుకుని రైతులు వ్యవసాయం చేయకుండా చేయలేదని ఆయన స్పష్టం చేశారు. విరాళాలు ఇవ్వడానికి ఎవరూ రావడం లేదని, వ్యాపారం కోసం మాత్రమే వస్తున్నారని, ప్రపంచ ఆర్థిక మాంద్యం చోటు చేసుకున్నప్పుడు ముఖ్య ఉద్దేశంతో భూములు ఇచ్చామని, మనం ఎక్కువ పరిశ్రమలను రాబట్టడానికి పరిస్థితిని వాడుకోవాల్సి ఉంటుందని చంద్రబాబు కూడా చెప్పారని ఆయన అన్నారు. అలా వాడుకోవడానికి భూములు కేటాయించడం వల్ల సెజ్‌ల ద్వారా ఉత్పత్తులు జరిగి ఎగుమతులు చేశామని, ఉద్యోగ వసతులు పెరిగాయని ఆయన చెప్పారు. మనం కోలుకోవడానికి ఇది ఉపయోగపడిందని ఆయన చెప్పారు.

English summary
CM Kiran Kumar Reddy retaliated opposition leader N Chandrababu Naidu on land allocations issue. He made counter allegations against Chandrababu. TDP members opposed CM's allegations made against Chandrababu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X