మేం కాదు మా డ్రైవర్ చాలు: రఘువీరా రెడ్డికి జెసి ప్రభాకర్ రెడ్డి సవాల్

అనంతపురం జిల్లా కాంగ్రెస్ నేతలు తాము ఇప్పుడున్న కాంగ్రెసు పార్టీలోనే ఉంటామని ప్రమాణం చేయాలని సవాల్ చేశారు. తన అన్న దివాకర్ రెడ్డి, తాను తప్పితే అనంతపురం జిల్లాలో ముందు ముందు ఎవరూ కాంగ్రెసు పార్టీలో ఉండరని అన్నారు. రఘువీరారెడ్డి, మోహన్ రెడ్డి వంటి పలువురు నేతలు మాజీ పార్లమెంటు సభ్యుడు, వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వెంట వెళతారని అన్నారు. చివరకు అనంతపురం జిల్లా కాంగ్రెసులో మిగిలే నేతలం తామే అన్నారు.
కాగా బుధవారం అనంతపురం జిల్లా డిసిసి కార్యాలయంలోకి జెసి దివాకర్ రెడ్డి మనుషులు రాకుండా మంత్రి రఘువీరా రెడ్డి మనుషులు తాళం వేశారు. దీంతో జెసి అనుచరులు కార్యాలయం తాళాన్ని పగలగొట్టి లోనికి వెళ్లి మీడియా కాన్ఫరెన్సు పెట్టిన విషయం తెలిసిందే.