హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వదిన విజయమ్మపై పులివెందులలో పోటీ చేస్తా: వైయస్ వివేకానంద రెడ్డి

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Vivekananda Reddy
హైదరాబాద్: పులివెందుల శాసనసభా స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో తాను తన వదిన వైయస్ విజయమ్మపై పోటీ చేస్తానని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి, దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి సోదరుడు వైయస్ వివేకానంద రెడ్డి చెప్పారు. ఎన్నికల్లో సెంటిమెంట్లకు స్థానం లేదని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. అయితే, ఈ విషయంలో తుది నిర్ణయం కాంగ్రెసు పార్టీ అధిష్టానానిదేనని ఆయన అన్నారు. పార్టీ అధిష్టానం ఏమైనా చెప్తే తన నిర్ణయం మార్చుకుంటానని ఆయన అన్నారు. వైయస్ విజయమ్మపై పోటీ చేయడానికి వివేకానంద రెడ్డి విముఖత ప్రదర్శిస్తున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. వివేకానంద రెడ్డి మాటలు ఆ వార్తలను ఖండిస్తున్నాయి.

కాగా, వైయస్ రాజశేఖర రెడ్డి సెంటిమెంటును వాడుకోవడానికి పులివెందులలో కాంగ్రెసు పార్టీ విజయమ్మపై కాంగ్రెసు పార్టీ పోటీకి దిగకపోవచ్చునని కూడా ప్రచారం జరిగింది. అయితే, ఆ ప్రచారాన్ని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్‌తో పాటు వివేకానంద రెడ్డి కూడా అప్పుడే ఖండించారు. కడప పార్లమెంటు సీటుతో పాటు పులివెందుల అసెంబ్లీ స్థానంలో కాంగ్రెసు అభ్యర్థులు ఉంటారని వారు చెప్పారు. కడప పార్లమెంటు సీటులో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి వైయస్ జగన్‌పై వివేకానంద రెడ్డి అల్లుడు నర్రెడ్డి రాజశేఖర రెడ్డిని పోటీకి దించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి.

English summary
YS Rajasekhar Reddy brother and minister YS Vivekananda Reddy clearly stated that he will contest from Pulivendula assembly seat against YS Vijayamma. He said that there will be no sentiments in election.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X