కడపకు 15 జగన్, పులివెందులకు 16న విజయమ్మ నామినేషన్

YS Jagan-Vijayamma
కడప: మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఏప్రిల్ 15వ తారీఖున కడప పార్లమెంట్ స్థానానికి నామినేషన్ వేయనున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి సతీమణి వైయస్ విజయమ్మ పులివెందుల అసెంబ్లీ స్థానానికి 16న నామినేషన్ వేయనున్నారు. కడప, పులివెందుల స్థానాల్లో మే 8వ తేదీ ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని ఎన్నికల సంఘం ప్రకటించిన విషయం తెలిసిందే.

విజయమ్మ పులివెందుల శాసనసభ స్థానానికి, జగన్ కడప లోక్‌సభ స్థానానికి గత నవంబర్‌లో రాజీనామా చేయటంతో ఆ స్థానాలు ఖాళీ అయిన విషయం తెలిసిందే. దీంతో ఈ రెండు స్థానాలకూ ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. కాగా వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ రాష్ట్ర కార్యవర్గాన్ని ఉగాది పండుగ తర్వాత ప్రకటించనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+